Ladli Behna Scheme: సర్కారు కొత్త స్కీమ్.. మహిళల ఖాతాల్లో నెలకు 1000 రూపాయలు

Ladli Behna Scheme For Women: లాడ్లీ బెహనా స్కీమ్ పేరిట ప్రభుత్వ అందిస్తున్న ఈ మొత్తాన్ని మహిళలు తమ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాడ్లీ బెహన స్కీమ్ శాంక్షన్ లెటర్ అందుకున్న సునిత లోవంశి ఈ పథకం గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని తాను తన బిడ్డ చదువు కోసం అయ్యే ఖర్చులకు ఉపయోగించుకుంటాను అని స్పష్టంచేసింది. 

Written by - Pavan | Last Updated : Jun 1, 2023, 09:24 PM IST
Ladli Behna Scheme: సర్కారు కొత్త స్కీమ్.. మహిళల ఖాతాల్లో నెలకు 1000 రూపాయలు

Ladli Behna Scheme For Women: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తిప్పలు పడుతున్నాయి. అధికారంలో లేని పార్టీలు తాము అధికారంలోకి వస్తే అది ఇస్తాం.. ఇది ఇస్తాం అనీ హామీలు గుప్పిస్తుంటే.. ఇప్పటికే అధికారంలో ఉన్నవాళ్లు కూడా కొత్త కొత్త స్కీమ్ ల పేర్లతో కొత్త కొత్త ఐడియాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సర్కారుకు అలాంటి ఆలోచనే ఒకటి తట్టింది. ఆ ఆలోచనకు లాడ్లీ బెహనా స్కీమ్ అనే పేరు పెట్టడమే కాకుండా ఇవాళే ఆ పథకాన్ని కూడా లాంచ్ చేసేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లాంచ్ చేసిన ఈ లాడ్లి బెహనా స్కీమ్ కింద మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెల అర్హులైన మహిళల ఖాతాల్లో రూ. 1000 జమ చేయనుంది.
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్వయంగా ప్రభుత్వం ఎంపిక చేసిన నలుగురు మహిళల ఇళ్లకు వెళ్లి వారికే నేరుగా లాడ్లీ బెహనా స్కీమ్ శాంక్షన్ లెటర్స్ అందించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని దుర్గానగర్ అనే మురికివాడకు చెందిన శీతల్ మహవర్, సుష్మ రైక్వార్, సునిత లోవంశి, ఉమ్మెడి బాయి అనే నలుగురు మహిళలు తమ తమ నివాసాల వద్దే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల మీదుగా ఈ లాడ్లీ బెహనా స్కీమ్ శాంక్షన్ లెటర్స్ అందుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఈ లాడ్లీ బెహనా స్కీమ్ కింద అర్హులైన మహిళల ఖాతాల్లో ఇకపై ప్రతీ నెల 1000 రూపాయలు జమ కానున్నాయి. 

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలు తమ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల మీదుగా లాడ్లీ బెహన స్కీమ్ శాంక్షన్ లెటర్ అందుకున్న సునిత లోవంశి ఈ పథకం గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం అందించే ఈ రూ. 1000 లను తాను తన బిడ్డ చదువు కోసం అయ్యే ఖర్చులకు ఉపయోగించుకుంటాను అని స్పష్టంచేసింది. ఉమ్మెడి బాయి ఇంటికి వెళ్లిన సీఎం చౌహన్.. అక్కడ ఆమె కుటుంబసభ్యులు అనారోగ్యంతో బాధపడుతుండటం చూసి చలించిపోయారు. ఆమె కుటుంబసభ్యులకు తక్షణమే తగిన వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన లాడ్లీ బెహన స్కీమ్ కోసం 1.25 కోట్ల మంది మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఇదిలావుంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే... మహిళల ఖాతాల్లో నెల నెల రూ. 1500 డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో.. నవంబర్ నెలలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి బీజేపి సర్కారు ప్రారంభించిన ఈ లాడ్లీ బెహనా స్కీమ్ మహిళా ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trending News