JEE Mains 2021 & NEET 2021 Exams: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడో తెలుసా

JEE Mains 2021 & NEET 2021 Exams: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. కీలకమైన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుసుకోండి. కరోనా పరిస్థితిపై సమీక్ష అనంతరం రీ షెడ్యూల్ విడుదల కానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2021, 02:34 PM IST
JEE Mains 2021 & NEET 2021 Exams: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడో తెలుసా

JEE Mains 2021 & NEET 2021 Exams: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. కీలకమైన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుసుకోండి. కరోనా పరిస్థితిపై సమీక్ష అనంతరం రీ షెడ్యూల్ విడుదల కానుంది.

ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్(JEE Mains), నీట్ పరీక్షలపై త్వరలోనే స్పష్టత రానుంది. కరోనా సంక్షోభం కారణంగా ఈ పరీక్షల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో ఇప్పటికే రెండు సెషన్లు పూర్తి కాగా..మిగిలిన రెండు సెషన్స్ జూలై, ఆగస్టు నెలల్లో జరగాల్సి ఉంది. అటు నీట్ పరీక్షల్ని(NEET Exams) ఆగస్టు 1 నుంచి నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ (Covid) కారణంగా ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాల్లేవు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది. 

నీట్(NEET) అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం తిరిగి కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నారు. నీట్ యూజీ 2021 దరఖాస్తు, షెడ్యూల్, బ్రోచర్, అడ్మిట్ కార్డ్, ఆన్సర్ కీ, రిజల్ట్, కటాఫ్ మార్క్స్ వంటి వివరాలు neet.nta.nic.in లో అందుబాటులో ఉండనున్నాయి. నీట్ 2021 అధికారిక వెబ్‌సైట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) జూన్ నెలలో ప్రారంభించింది. అభ్యర్ధులంతా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నీట్ 2021 అప్లికేషన్ భర్తీ చేయాలి. అందులో అభ్యర్ధి పేరు, కాంటాక్ట్ నెంబర్, పరీక్ష కేంద్రం వంటి వివరాలు నమోదు చేయాలి. నిర్ణీత ఫీజు చెల్లించి..స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ అప్‌లోడ్ చేయాలని ఎన్‌టీఏ సూచించింది.

Also read: India Corona Positive Cases: ఇండియాలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు, COVID-19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News