Highest salary jobs: ఉద్యోగం కోసం కంపెనీని ఎంచుకునేముందు ముఖ్యంగా పరిగణలో తీసుకునేది శాలరీ ప్యాకేజ్ ఎంత అనేదే. వివిధ కంపెనీల సామర్ధ్యాన్ని బట్టి, ఉద్యోగి ప్రతిభను బట్టి శాలరీ ప్యాకేజ్ నిర్ధారణ అవుతుంటుంది. వివిధ కంపెనీల్లో ప్రోగ్రామర్ వార్షిక వేతనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఉద్యోగం కోసం కంపెనీని ఎంచుకునేముందు ముఖ్యంగా పరిగణలో తీసుకునేది శాలరీ ప్యాకేజ్ ఎంత అనేదే. వివిధ కంపెనీల సామర్ధ్యాన్ని బట్టి, ఉద్యోగి ప్రతిభను బట్టి శాలరీ ప్యాకేజ్ నిర్ధారణ అవుతుంటుంది. ఏ ఐటీ కంపెనీ ఎంత వేతనం ఇస్తుందనే విషయంపై ఇప్పటికే చాలా అపోహలున్నాయి. ఆ నోటా ఈ నోటా వచ్చే సందేహాలకు ఇక చెక్ పెట్టండి. వివిధ కంపెనీల్లో ఎవరు ఎంత వేతనాలు ఇస్తున్నారనే డేటా ఆధారంగా టెక్కీల శాలరీ ప్యాకేజీలు ఏ కంపెనీలో ఏ మేరకుందో పరిశీలిద్దాం.
వివిధ ఐటీ కంపెనీల్లో ప్రోగ్రామర్లకు లభించే శాలరీ ప్యాకేజ్ వివరాలు ( Who Offers highest salaries to the programmer)
1. విప్రోలో (Wipro) ప్రోగ్రామర్ శాలరీ ఏడాదికి దాదాపు 4 లక్షల 66 వేల 667 రూపాయలుంటుంది. ఈ సంస్థలో సాధారణంగా ఒక ప్రోగ్రామర్ ఏడాదికి 4.6 లక్షల శాలరీ ప్యాకేజ్ తీసుకుంటాడు. ఇందులో కనిష్టంగా ఉంటే 2.4 లక్షలుంటుంది. గరిష్టంగా 8.6 లక్షల శాలరీ ఉంటుంది. అయితే హయ్యస్ట్ శాలరీ అనేది ఆ ఉద్యోగి ప్రతిభ, స్కిల్స్, అనుభవం మీద ఆధారపడి ఉంటాయి.
2. కాగ్నిజంట్ (Cognigent) కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాదికి 4 లక్షల 84 వేల 968 రూపాయల వరకూ తీసుకుంటాడు. ఈ సంస్థలో ఉద్యోగి ప్రతిభ, అనుభవం ఆధారంగా 2.7 లక్షల నుంచి 8.5 లక్షల వరకూ శాలరీ ఉంటుంది. సరాసరి చూసుకుంటే ఏడాదికి 4.84 లక్షల రూపాయలుంటుంది.
3. ఇక మరో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రోగ్రామర్ కు ఏడాదికి 4 లక్షల 74 వేల 384 రూపాయల వరకూ ఉంటుంది. ఒక ఉద్యోగి సరాసరి సీటీసీ ఏడాదికి 4.7 లక్షల వరకూ ఉంటుంది. ఇన్ఫోసిస్ కంపెనీలో కనిష్టంగా ఏడాదికి 3.13 లక్షల నుంచి గరిష్టంగా 7.66 లక్షల వరకూ ఉంటుంది.
4. ఇక టీసీఎస్ (TCS) కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాది వేతనం సరాసరిన 5 లక్షల 8 వేల 304 రూపాయల వరకూ ఉంటుంది . దేశంలోనే బెస్ట్ టెక్ కంపెనీగా పేరున్న టీసీఎస్‌లో సరాసరిన 5 లక్షల శాలరీ ఉంటుంది. ఇందులో కనిష్టంగా 2.8 లక్షల రూపాయల్నించి గరిష్టంగా 8.72 లక్షల వరకూ ఉంటుంది.
5. ఇక హెచ్‌సీఎల్ (HCL)కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాది వేతనం దాదాపుగా 4 లక్షల 83 వేల వరకూ ఉంటుంది. ఈ కంపెనీలో కనిష్టంగా ఏడాదికి 4.83 లక్షలు చెల్లిస్తారు. గరిష్టంగా 8.6 లక్షల వరకూ ఉంటుంది.
6. యాక్సెంచర్ (Accenture) కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాది వేతనం దాదాపుగా 6 లక్షల వరకూ ఉంటుంది. ఈ కంపెనీలో ఉద్యోగికి ఏడాది వేతనం దాదాపుగా 6 లక్షల రూపాయలుంటుంది. అయితే ఉద్యోగి ప్రతిభ, అనుభవం ఆధారంగా మారుతుంటుంది. ఇందులో కనిష్టంగా 3 లక్షల రూపాయల్నించి గరిష్టంగా 10 లక్షల వరకూ ఉంటుంది.
7. ఇక టెక్ మహీంద్ర (Tech Mahindra)కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాది వేతనం 4 లక్షల 50 వేల 743 రూపాయల వరకూ ఉంటుంది. ఏడాదికి సరాసరి సీటీసీ 4.5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో కనిష్టంగా 2.5 లక్షల నుంచి గరిష్టంగా 8.4 లక్షల వరకూ ఉంటుంది.
8. మరో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ క్యాప్ జెమినీ (Capgemini). ఇందులో ఏడాదికి 5 లక్షల 59 వేల 877 రూపాయల వరకూ ఉంటుంది. ఈ కంపెనీలో ప్రోగ్రామర్ ఏడాది వేతనం దాదాపుగా 6 లక్షల రూపాయలుంటుంది. ఇందులో కనిష్టంగా 2.8 లక్షల రూపాయల్నించి గరిష్టంగా 10.4 లక్షల వరకూ ఉంటుంది.
Also read: Sunny Leone: వివాదంలో సన్నీలియోన్ సాంగ్...నిషేధించాలంటున్న పూజారులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి