Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా లేఖ ( Kerala CS Vishwas Mehta ) రాశారు. కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళలోని శబరిమల ఆలయంలో ( Sabarimala temple ) కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు ( Ayyappa devotees ) తెలియజేయాలనే ఉద్దేశంతో కేరళ సీఎస్ మెహతా ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. 

Last Updated : Oct 15, 2020, 06:42 PM IST
Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా లేఖ ( Kerala CS Vishwas Mehta ) రాశారు. కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళలోని శబరిమల ఆలయంలో ( Sabarimala temple ) కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు ( Ayyappa devotees ) తెలియజేయాలనే ఉద్దేశంతో కేరళ సీఎస్ మెహతా ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. శబరిమల ఆలయంలో నెయ్యితో అభిషేకం, పంపానదిలో పుణ్య స్నానాలకు ( Holy dip in Pampa river ) అనుమతి ఇవ్వడం లేదని కేరళ ప్రభుత్వం ఈ లేఖ ద్వారా వెల్లడించింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల దేవస్థానానికి వచ్చే భక్తులు వర్చువల్‌ క్యూ పోర్టల్‌ ద్వారా దర్శనం కోసం తమ వివరాలను తప్పనిసరని నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కేరళ సీఎస్ ఈ లేఖలో పేర్కొన్నారు. Also read : Traffic Cop dragged on car: ట్రాఫిక్ పోలీసును కారుపై లాక్కెళ్లిన డ్రైవర్

కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) అనంతరం తొలిసారిగా జరగనున్న అయ్యప్ప దీక్ష కావడంతో కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు శబరిమలలోనూ పలు నిబంధనలు అమలులో ఉంటాయని కేరళ సీఎం విశ్వాస్ మెహతా తెలిపారు. తొలుత రోజుకు వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అయ్యప్ప స్వామి దర్శనానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. 

కొవిడ్-19 ప్రోటోకాల్స్ ( COVID-19 protocols ) ప్రకారం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 48 గంటల ముందు కొవిడ్‌ నెగటివ్‌ నిర్ధారణ పరీక్ష ( COVID-19 tests ) తప్పనిసరి చేశామని.. అలాగే పదేళ్ల లోపు బాల, బాలికలు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు https://sabarimalaonline.org ద్వారా తమ పేరు, వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు కేరళ సీఎం మెహతా వెల్లడించారు. Also read : Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News