Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

Kerala Governor Stir: దేశంలో చాలా రాష్ట్రాల్లో గవర్నర్‌కు, ప్రజా ప్రభుత్వానికి మధ్య విబేధాలు ఉంటూనే ఉన్నాయి. కేరళలో మాత్రం తీవ్రంగా ఉంది. గవర్నర్‌ తీరుకు పెద్ద ఎత్తున మలయాళ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన పర్యటనకు అడ్డంకులు సృష్టించడంతో గవర్నర్‌ నడిరోడ్డు మీద కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 03:57 PM IST
Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

Governor Vs Kerala Govt: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలలుగా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఎం అనుబంధ సంఘాలు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్‌ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఆందోళనలు చేపడుతోంది. తాజాగా కొల్లం జిల్లాలో గవర్నర్‌ పర్యటిస్తే అక్కడ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కారు దిగి బయటకు వచ్చారు. ఓ దుకాణంలో కుర్చీ తీసుకుని నడిరోడ్డు మీద కూర్చున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు గవర్నర్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారుకు సమీపంలోకి రావడంతో గవర్నర్‌ మండిపడ్డారు. వెంటనే కారు దిగి ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తతో వాగ్వాదానికి దిగారు. 'మీరు వెనక్కి వెళ్లండి' అని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త చెప్పగా 'నేను వెళ్లేదే లేదు' అని గవర్నర్‌ చెబుతూ దుకాణంలోకి వెళ్లారు. అనంతరం కుర్చీ తెచ్చుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై మండిపడ్డారు. మీరు ఆందోళనకారులకు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇంకా శాంతిభద్రతలను ఎవరు కాపాడతారు? అన ప్రశ్నించారు. 13 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పగా మిగతా వారి పరిస్థితి ఏంటి అని నిలదీశారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

గవర్నర్‌కు ఇలాంటి సంఘటన ఎదురవడం ఇది మొదటిది కాదు. గతంలో త్రివేండ్రమ్‌లో కూడా గవర్నర్‌కు ఇలాంటి పరిణామం ఎదురైంది. కాగా గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినా తాము వెనక్కి తగ్గమని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు చెబుతున్నారు. 'వెధవ నేరస్తులు' అని గవర్నర్‌ మాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వాటికి నిరసనగా కొన్ని నెలలుగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 'ఎలాంటి అర్హతలు లేకుండా బీజేపీ కార్యాలయం నుంచి గవర్నర్లుగా వస్తున్నారు. ఆయన తీరుపై ఆందోళన చేపడుతూనే ఉంటాం. మేం వెనక్కి తగ్గం' అని స్పష్టం చేశారు.

వివాదానికి కారణం
కొన్ని బిల్లుల వ్యవహరంలో గవర్నర్‌కు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం పంపించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడం, విశ్వవిద్యాలయ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై గవర్నర్‌, సీఎం మధ్య వివాదం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని అంశాలు న్యాయ పరిధికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ తీరుపై వెనక్కి తగ్గడం లేదు. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాగా తీవ్ర వివాదం నేపథ్యంలో గవర్నర్‌ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. జెడ్‌ ప్లస్‌ భద్రతను కేటాయించినట్లు రాజ్‌భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపు
Also Read Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News