AAP: విస్తరణపై కేజ్రీవాల్ ఫోకస్.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఇంచార్జర్ల నియామకం

ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేలా పావులు కదుపుతోంది. పంజాబ్ లో అద్బుత విక్టరీ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది ఆప్. త్వరలో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్రారంభించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 03:48 PM IST
  • పంజాబ్ గెలుపు తరువాత ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్
  • గుజరాత్ ఇంచార్జ్‌గా డాక్టర్ సందీప్ పాఠక్‌ను నియామకం
  • తెలంగాణలో ఎన్నికల బాధ్యతలను ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతీకి అప్పగింత
  • సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతీ వరుస ట్వీట్లు
AAP: విస్తరణపై కేజ్రీవాల్ ఫోకస్.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఇంచార్జర్ల నియామకం

AAP Expansion: ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేలా పావులు కదుపుతోంది. పంజాబ్ లో అద్బుత విక్టరీ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది ఆప్. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్రారంభించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా  అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ.  

ఆప్ గుజరాత్ ఇంచార్జ్‌గా డాక్టర్ సందీప్ పాఠక్‌ను నియమించారు పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి డాక్టర్ సందీప్ పాఠక్ వ్యూహాలు బాగా పని చేశాయని చెబుతున్నారు. పంజాబ్ తరహాలో కొత్త వ్యూహంతో గుజరాత్‌లో ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే గుజరాత్ బాధ్యతలను సందీప్ పాఠక్‌కు అప్పగించింది ఆప్.హిమాచల్ ప్రదేశ్‌కు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, దుర్గేష్ పాఠక్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దుర్గేష్ పాఠక్‌కు గతంలో గోవా ఎన్నికల బాధ్యతలు చూశారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్‌ను హర్యానా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. ద్వారక ఎమ్మెల్యే వినయ్‌ మిశ్రా రాజస్థాన్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. 

తెలంగాణలో ఎన్నికల బాధ్యతలను ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతీకి అప్పగించారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేశారు సోమ్ నాథ్ భారతీ. సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ఆప్ బట్టబయలు చేస్తుందని ఇటీవలే సోమ్ నాథ్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కు ఆయన ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ హిమాచల్‌లో పార్టీ తరఫున ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉంటారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతలు ఎమ్మెల్యే సంజీవ్‌ ఝాకు అప్పగించారు.  మంత్రి గోపాల్‌ రాయ్‌ని ఎన్నికల బాధ్యుడిగా నియమించింది. హర్యానాలో రాజ్యసభ సభ్యులు సుశీల్‌, కేరళలో ఎ.రాజా, అస్సాంలో రాజేశ్‌ శర్మ ఆప్‌ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జులుగా ఉంటారు. ఇతర రాష్ట్రాలకూ ఆఫీస్‌ బేరర్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

Also Read: Nagababu on Niharika: నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది నేనే..

Also Read: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌! ఇక పండగే పో!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News