దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులు, మాజీ అధికారులు, న్యాయనిపుణులు తదితరులతో సమావేశం అవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది..
భవిష్యత్ కార్యాచరణ ఇదే..
1. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవమున్న మాజీ ఐఏఎస్ అధికారులతో భేటీ
2. రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులతో భేటీ
3.అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ
4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ సంఘాలతో భేటీ
5. మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలతో భేటీ
6. పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాలు ప్రతినిధులతోనూ భేటీ
7 కేంద్రం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలలో పనిచేసిన ఆర్ధిక శాఖ అధికారులు, నిపుణులతో భేటీ
భేటీ స్థలాలు: ప్రముఖులు, వివిధ సంఘాలతో నిర్వహించే సమావేశాలు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై , బెంగళూరు, నగరాల్లో నిర్వహించాలని నిర్ణయం.
కేసీఆర్ లక్ష్యాలు:
* దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏళ్ల తరబడి పనిచేయడం, అనేక రాజకీయపరిణామాలు చూసిన అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్‌లతో సమావేశమైతే దేశానికి కావాల్సిన ఎజెండాను రూపొందించడానికి వీలుకలుతుంది.
* సైనిక, వైమానిక, నౌకదళ మాజీ ఉన్నతాధికారులుతో భేటీ అయితే రక్షణశాఖకు సంబంధించిన ఎజెండా రూపొంచవచ్చు
* న్యాయనిపుణలు, ప్రముఖ న్యాయవాదులతో భేటీతో దేశంలో ఉన్న చట్టాల్లో మార్పులు వంటి అంశాలపై అవగాహనకు రావడం
* అఖిల భారత రైతులు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో భేటీలతో దేశ వ్యాప్తంగా రైతు సమస్యలపై అవగాహన చేసుకోవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ సంఘాలతో కలిస్తే ఉద్యోగ వర్గాల సమస్యలు తెలసుకోవచ్చు
* పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాలు ప్రతినిధుల భేటీతో కార్మిక, యాజమాన్యాల సమస్యలు తెలుసుకోవచ్చు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసిన ఆర్ధిక శాఖ అధికారులు, నిపుణులతో భేటీతో ప్రభుత్వ పథకాల్లోని లోపాలు.. కొత్త గా అమలు చేయాల్సిన పథకాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ఇదిలా ఉండగా వివిధ వర్గాలతో సమావేశాల కోసం ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలిసింది. ఆయా వర్గాలకు భేటీ అయ్యేందుకు ..వారిని సంప్రదించడానికి ..సమన్వయం చేయడానికి కేసీఆర్ ప్రత్యేక సమన్వయకర్తలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ థార్ట్ ఫ్రంట్ లక్ష్యం ఏ మేరకు సాధ్యమౌతుందనే దానిపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.