కథువా నిందితులను కఠినంగా శిక్షించాలి: రాష్ట్రపతి

జమ్ము కాశ్మీర్‌లోని కథువాలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Last Updated : Apr 19, 2018, 09:37 AM IST
కథువా నిందితులను కఠినంగా శిక్షించాలి: రాష్ట్రపతి

జమ్ము కాశ్మీర్‌లోని కథువాలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. చిన్నారులు, మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కత్రాలోని శ్రీ మాతావైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యాక్రమంలో మాట్లాడిన ఆయన, స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా, దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటివి జరగడం సిగ్గుగా ఉంది. మనము ఎటువంటి సమజంలో ఉన్నామో, సమాజం ఎటువైపుపోతోందో ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది' అని కోవింద్ అన్నారు. ఎంతో మంది భారత బిడ్డలు దేశానికి కామన్వెల్త్ క్రీడల్లో గౌరవం తీసుకొచ్చారని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఢిల్లీకి చెందిన మానికా బాత్రా, మణిపూర్ కు చెందిన మేరీకోమ్, మీరాబాయ్, సంగీత, హర్యానాకు చెందిన మను భాకర్, వినేశ్ ఫోగట్, తెలంగాణకు చెందిన సైనా, పంజాబ్ కు చెందిన హీనా సింధు లాంటివారు ఉన్నారని కోవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించారు.

 

 

Trending News