హైకోర్టు జోక్యంతో వివాదం ముగిసింది ; మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు

                                                                                

Last Updated : Aug 8, 2018, 12:07 PM IST
హైకోర్టు జోక్యంతో వివాదం ముగిసింది ; మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు

హైకోర్టు జోక్యంతో కరుణానిధి అంత్యక్రియల వివాదం ముగిసింది.  అ వివాదంపై యుద్ధప్రాతిపదికన విచారణ జరిపిన ధర్మాసనం.. కరుణనిధి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ మాత్రం గౌరవం ఇవ్వడంలో తప్పలేదని అభిప్రాయపడింది.. ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నట్లుగా మెరీనా బీచ్ లోనే కరుణనిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి  కోర్టు దేశాలు జారీ చేసింది

కరుణానిధి మరణానంతరం మెరీనా బీచ్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం పళని స్వామికి  కరుణ కుటుంబ సభ్యలు కోరారు. తొలుత పరిశీలిస్తామని చెప్పిన సీఎం పళనిస్వామి.. అనంతరం తిరస్కరించడంతో డీఎంకే శ్రేణులు నిరసనకు దిగారు. మరోవైపు మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించేలా చూడాలని కరుణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వరులు జారీ చేసింది.  దివంగత నేతలు ఎన్జీ రంగా, జయలలితలను కూడా మెరీనా బీచ్ లోనే అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరుణానిధి అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహిస్తుండటం గమనార్హం.

Trending News