కార్తీ చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ

నేరపూరిత అవినీతి, మోసం, కుట్రలకు పాల్పడినట్లు కార్తి చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

Last Updated : Feb 28, 2018, 09:24 AM IST
కార్తీ చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ

న్యూఢిల్లీ: బుధవారం కాంగ్రెస్ నేత కార్తి చిదంబరంను మనీలాండరింగ్ కేసులో సీబీఐ చెన్నైలో అరెస్టు చేసింది. పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మారిషస్ నుంచి నిధులను స్వీకరించినందుకు కార్తి చిదంబరంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా యాజమాన్యంలోని ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ మీడియా గ్రూప్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులకు సంబంధించి ఈ కేసు నమోదైంది.

గత నెలలో చెన్నైలోని కార్తి చిదంబరం నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో కార్తి, తదితరులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు దాఖలు చేసింది. నేరపూరిత అవినీతి, మోసం, కుట్రలకు పాల్పడినట్లు కార్తి, ముఖర్జీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

Trending News