Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ కల్లోలం- ఒక్క రోజులో 32,793 పాజిటివ్ కేసులు

Karnataka Corona cases: కర్ణాటకలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 08:13 PM IST
  • కర్ణాటకలో కొవిడ్ విజృంభణ
  • ఒక్క రోజులో 32 వేలకుపైగా పాజిటివ్ కేసులు
  • బెంగళూరులోనే అత్యధికంగా కరోనా బాధితులు
Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ కల్లోలం- ఒక్క రోజులో 32,793 పాజిటివ్ కేసులు

Karnataka Corona cases: కర్ణాటకలో కొవిడ్ విజృంభణ రోజు రోజుకు తీవ్రమవుతోంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి పెరిగినట్లు కర్ణాటక ఆరోగ్య విభాగం శనివారం (Karnataka Covid Update) ప్రకటించింది.

కొత్త కేసులు ఇలా..

కర్ణాటక వ్యాప్తంగా తాజాగా (జనవరి 14న) 32,793 కరోనా కేసులు (New Corona cases in Karnataka) నమోదయ్యాయి. ఇందులో ఒక్క బెంగళూరు లోనే 22,284 మందికి కొవిడ్ పాజిటివ్​గా (Bangalore Corona caes) తేలినట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి 2,18,479 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 3,186,040 మందికి పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 4,273 మంది కొవిడ్​ను (Corona recoveries in Karnataka) జయించారు. ఇప్పటి వరకు మొత్తం 2,977,743 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో ప్రస్తుతం 1,69,850 యాక్టివ్​ కరోనా కేసులు (Active Corona cases in Karnataka) ఉన్నాయి. ఇందులో లక్ష 29 వేల కేసులు బెంగళూరులోనే ఉండటం (Active Corona cases in Bangalore) గమనార్హం.

ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 14న 7 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో బంగళూరులోనే 5 మరణాలు నమోదవటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,418 మంది కరోనా మహమ్మారికి (Corona deaths in Karnataka) బలయ్యారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఇలా..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో రాష్ట్రంలోని అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం.

జనవరి 14న 1,283 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు మొత్తం 638,679 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించింది. ఇందులో 26,827 మంది హై రిస్క్ దేశాల నుంచి కర్ణాటకకు వచ్చినట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.

Also read: కంగనా బుగ్గల కంటే స్మూత్‌గా ఉండే రోడ్లు వేయిస్తా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Also read: Pradyuman Singh - Babina Bai: రోడ్డుపై కూరగాయల అమ్మే బామ్మ కాళ్లు పట్టుకుని.. చెంప దెబ్బలు కొట్టించుకున్న మంత్రి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News