Muslim man donates his land for Hanuman Temple: బెంగళూరు: హనుమాన్ ఆలయ (Hanuman Temple) నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటాడు. కర్ణాటక రాష్ట్రం ( Karnataka ) లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బెంగళూరు ప్రాంతంలోని (Kadugodi in Bengaluru) కడుగోడి గ్రామానికి చెందిన హెచ్ఎంజీ బాషా ( HMG Basha ).. మైలపుర (Mylapura) లో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం సుమారు రూ.80లక్షల విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారి బాధలను చూసి తన భూమిని విరాళంగా ఇచ్చేందుకు ఆరు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని బాషా పేర్కొన్నారు.
HMG Basha donated the land for construction of temple wholeheartedly. Construction of the temple is underway We are very happy that a Muslim man donated land for the temple: Bhyre Gowda, Temple Trustee. #Karnataka https://t.co/vYuBTeZong pic.twitter.com/anAy41XlXE
— ANI (@ANI) December 8, 2020
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బైరి గౌడ మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి బాషా మనస్ఫూర్తిగా తన భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తి అయినప్పటికీ.. హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందని బైరి గౌడ కొనియాడారు. Also read: Shirdi Sai Baba Temple: సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే బాబా దర్శనం
కడుగోడీ గ్రామంలో నివాసముంటున్న హెచ్ఎంజీ బాషాకు హైవే సమీపంలోని ( Bengaluru ) మైలపురలో మూడెకరాల భూమి ఉంది. హనుమాన్ ఆలయాన్ని విస్తరించడానికి ఆరు నెలల క్రితం దేవాలయ కమిటీ సభ్యులు బాషాను స్థలం కోరగా.. అప్పుడే ఆయన భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఆలయ కమిటీ సభ్యులు 1.5 సెంట్లు భూమి మాత్రమే అడగ్గా.. బాషా ఏకంగా ఒకటిన్నర గుంటల భూమి విరాళమిచ్చి గొప్ప మనస్సును చాటుకున్నారు. దీంతో బాషా విరాళమిచ్చిన విషయాన్ని తెలియజేస్తూ.. ఆలయ కమిటీ సభ్యులు ఓ ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. అందరూ బాషా నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also read: CM KCR: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe