Coronavirus: కరోనాపై గెలిచిన మరో సీఎం

కరోనావైరస్‌పై యుద్ధంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గెలుపును సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ( Karnataka CM BS Yediyurappa )  కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.

Last Updated : Aug 10, 2020, 06:29 PM IST
  • కరోనాపై పోరులో విజయం సాధించిన కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప
  • వారం రోజుల చికిత్స అనంతరం నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం
  • తనకు చికిత్స అందించి నయం చేసిన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పిన సీఎం
Coronavirus: కరోనాపై గెలిచిన మరో సీఎం

బెంగళూరు: కరోనావైరస్ ( Coronavirus )పై యుద్ధంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గెలుపును సాధించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తరహాలోనే కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ( Karnataka CM BS Yediyurappa ) కూడా కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆగస్టు 2న నిర్వహించిన కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల్లో ( COVID-19 tests ) సీఎం యడ్యూరప్పకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో కొవిడ్-19 చికిత్స కోసం ఆయన మణిపాల్ హాస్పిటల్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వారం రోజుల చికిత్స అనంతరం యడ్యూరప్పకు కరోనావైరస్ నయం కావడంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నప్పటి ఫోటోలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Also read: COVID-19: తెలంగాణ సర్కార్‌పై బీజేపి చీఫ్ జేపీ నడ్డా ఫైర్

ఇదిలావుంటే, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ( Karnataka floods ) పోటెత్తుతుండటంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. యడ్యూరప్ప ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందుగా ఇవాళ ఉదయం ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ( Basavaraj Bommai ) రాష్ట్రంలో వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ ( PM Modi ) నేతృత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశానికి సైతం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తరపున కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ హాజరై రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఈ సమావేశం అనంతరం బసవరాజ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. Also read: Sanjay Dutt: ఆసుపత్రి నుంచి సంజయ్ దత్ డిశ్ఛార్జ్

Trending News