Lockdown again: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనా కేసులు కర్నాటకలో నమోదవుతున్నాయి. ప్రజలు మాట వినకపోతే లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందనే హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం.
కరోనా మహమ్మారి(Corona pandemic)ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తప్పవా..మరోసారి రాష్ట్రాలు లాక్‌డౌన్ (Lockdown) దిశగా నిర్ణయం తీసుకోనున్నాయా..పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా ఢిల్లీ, పూణే, బెంగళూరు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ( Night Curfew) అమల్లో ఉంది. అయినా సరే పరిస్థితి అదుపులో రావడం లేదు. ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. ఈ నేపధ్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప( Yedyurappa) చెబుతున్నారు. బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు అనివార్యమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు.
ప్రజలు కచ్చితంగా నియమాల్ని పాటించాలని..రద్దీగా ఉండకూడదని కోరారు. వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించామని..ప్రజలు సహకరించకపోతే లాక్‌డౌన్( Lockdown)తో పాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 17 న రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల అనంతరం కరోనా మహమ్మారి కట్టడి కోసం మరిన్ని కఠిన నియమాల్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు.
Also read: Corona second wave: శ్మశానంలో...మార్చురీలో స్థలం లేక ఘోర పరిస్థితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook