BJP MLA Madal Virupakshappa Son Bribe Case: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లంచ తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో లోకాయుక్త పోలీసులు రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అవినీతికి ఎవరు పాల్పడినా.. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఇది తన కుటుంబంపై కుట్ర అని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ లంచాల కుంభకోణం బీజేపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
వివరాలు ఇలా.. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశాంత్ గురువారం కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేఎస్‌డీఎల్‌కు విరూపాక్షప్ప చైర్మన్‌గా ఉన్నారని.. ప్రశాంత్ తన తండ్రి తరపున లంచం మొదటి విడతగా తీసుకుంటున్నారని లోకాయుక్త వర్గాలు తెలిపాయి. కేఎస్‌డీఎల్ కార్యాలయం నుంచి మూడు బ్యాగుల నిండా నగదును పోలీసులు గుర్తించారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసిన వెంటనే లోకాయుక్త అధికారులు ఆయన ఇంటిపై శుక్రవారం దాడి చేసి తమ కార్యకలాపాలను కొనసాగించారు. ప్రశాంత్ ఇంట్లో రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సబ్బులు, డిటర్జెంట్ తయారీ కోసం కేఎస్‌డీఎల్‌కు అవసరమైన రసాయనాలను సరఫరా చేసిన కాంట్రాక్టర్ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎమ్మెల్యే కుమారుడు రూ.81 లక్షలు డిమాండ్ చేయగా.. మొదటి విడతగా రూ.40 లక్షలు ఇచ్చారు. లంచం డిమాండ్‌పై కాంట్రాక్టర్ వారం రోజుల క్రితం లోకాయుక్తను ఆశ్రయించగా.. ఆ తర్వాత ఇలా ఉచ్చు బిగించారు.
ఎమ్మెల్యే కొడుకు అరెస్టుపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూఏ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిరి కాకుండా.. అవినీతిని అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం లోకాయుక్తను పునరుద్ధరించిందన్నారు. లోకాయుక్త పోలీసులు వల వేయడమే నిదర్శనమని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు లోకాయుక్త సంస్థ కాకుండా ప్రత్యేక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసిందన్నారు.
గతంలో బలమైన లోకాయుక్త లేకపోవడంతో కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కేసులను విచారించలేకపోయారని ఆయన అన్నారు. న్యాయమైన విచారణ జరుపుతామమని.. స్వతంత్ర లోకాయుక్త సంస్థ నిష్పక్షపాతంగా విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. అక్కడ దొరికిన డబ్బు, ప్రతిదీ ఇప్పుడు లోకాయుక్త వద్ద ఉందని.. దీని ఉద్దేశం ఏమిటో బయటకు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. దీంతో పాటు అవినీతికి పాల్పడిన వ్యక్తిని ఏ పార్టీకి చెందిన వారైనా తమ ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టంచేశారు.
ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రాసిన లేఖ రాశారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. తనపై ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ మాటల దాడికి దిగింది. కర్ణాటకలోని బీజేపీ నేతల వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ డబ్బు ఉందని ఆరోపణలు గుప్పించారు. 'ఆర్‌బీఐలో కంటే కర్ణాటక బీజేపీ నేతల ఇళ్లలోనే ఎక్కువ డబ్బు ఉంది. అమిత్ షా తరచూ రాష్ట్రానికి వస్తున్నారు. అందుకే వారికి చేరాల్సిన డబ్బు పట్టుబడిందా?' అని ఆ పార్టీ ట్వీట్ చేసింది.
Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్
Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. సీఎం రియాక్షన్ ఇదే..