Kargil Vijay Diwas 2023: ఈరోజే 'కార్గిల్ విజయ్ దివాస్'.. దీని యెుక్క ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకోండి..

Vijay Diwas  2023: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమై.. జూలై 26న ముగిసింది. అందుకే జూలై 26న విజయ్ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2023, 09:53 AM IST
Kargil Vijay Diwas 2023: ఈరోజే 'కార్గిల్ విజయ్ దివాస్'.. దీని యెుక్క ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకోండి..

Kargil Vijay Diwas 2023: ప్రతి ఏటా జూలై 26న 'కార్గిల్ విజయ్ దివాస్' ను జరుపుకుంటారు. 1999, జూలై 26న పాకిస్తాన్ సైన్యం పై భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని (Kargil Vijay Diwas) దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్ దివాస్.

కార్గిల్ యుద్ధం..
కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న దురద్దేశంతో పాకిస్తాన్ సైన్యం ట్రైబల్ మిలీషియా మద్దతుతో 'ఆపరేషన్ బదర్' అనే పేరిట చొరబాటుదారులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. చొరబాటుదారులు కార్గిల్ యొక్క ద్రాస్‌లోని జాతీయ రహదారిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కశ్మీర్ లోయను లడఖ్‌కు కలిపే కీలక రహదారిపై పట్టు సాధించారు. తర్వాత పాకిస్థానీ చొరబాటుదారులు కాశ్మీర్ లోయ ప్రాంతంలోకి ప్రవేశించి దానిని ఆక్రమించుకోవాలని చూశారు. 

1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మెుదలైంది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' అనే మిషన్ ప్రారంభించిన దాదాపు రెండు నెలలపాటు గడ్డకట్టే చలిలో పోరాడింది. ఈ యుద్దంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారత్ కు చెందిన 527 మంది సైనికుల అమరులయ్యారు. దాదాపు 1000 మది పాకిస్థానీ సైనికులు మృతి చెందారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి.. తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది భారత్. దీనికు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ ను లడక్ సమీపంలోని ద్రాస్ టౌన్ లో ఏర్పాటు చేశారు. 

Also Read: Tomato Price: ఆన్‌లైన్‌లో రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News