Corona Fourth Wave: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. కరోనా థర్డ్‌వేవ్ నుంచి ఊపిరిపీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే విషయాలు వెల్లడించారు. అదే కరోనా ఫోర్త్‌వేవ్.
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కోవిడ్ 19 వరుసగా మూడు వేవ్‌లుగా ఇండియాలో విజృంభించింది. థర్డ్‌వేవ్ ప్రాణాంతకం కాకపోయినా..సెకండ్ వేవ్ మాత్రం విలవిల్లాడించింది. వేలాది ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి. ఆసుపత్రుల్లో..ఇళ్లల్లో శ్వాస అందక ఊపిరాగిన ఘటనలు ఎన్నో. ఈ నేపధ్యలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభం కాగానే..మరింత ఆందోళన రేగింది. అదృష్టవశాత్తూ కేసుల సంఖ్య త్వరగానే తగ్గుముఖం పట్టింది. ప్రాణనష్టం తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్న పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్‌వేవ్ ప్రారంభమయ్యేందుకు 6 నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్‌వేవ్ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేందుకు 4-5 నెలల సమయం పట్టింది. కరోనా థర్ద్‌వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని అంతా అనుకుంటున్న తరుణంలో కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు ఉలిక్కిపడే అంశాలు వెల్లడించారు. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
కరోనా ఫోర్త్‌వేవ్ ఎంట్రీ ఇవ్వనుందని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. మరో నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కావచ్చనేది కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అంచనా. జూన్ నెలలో ప్రవేశించి..అక్టోబర్ వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ జూన్ 22 నాటికి ప్రారంభం కావచ్చని తాజా అంచనా. అయితే కరోనా ఫోర్త్‌వేవ్ తీవ్రతపై ఇంకా అంచనా వేయలేదు. ఇది వైరస్ సంక్రమణ, కొత్త వేరియంట్ బట్టి ఉంటుందని తెలుస్తోంది. కోవిడ్ బూస్టర్ డోసు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై కరోనా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఎలా ఉంటుందనేది తెలుస్తుందని కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కరోనా ఫోర్త్‌వేవ్ పీక్స్‌కు చేరుతుందని అంచనా. గతంలో కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కచ్చితంగా అంచనా వేసింది కూడా కాన్పూర్ ఐఐటీ పరిశోధకులే కావడం గమనార్హం.
దేశంలో కరోనా మహమ్మారి కేసులు ప్రస్తుతం రోజుకు పది వేలే నమోదవుతున్నాయి. కరోనా కొత్త కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకూ తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 4 కోట్ల 29 లక్షల 16 వేల 117కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1 లక్షా 11 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5 లక్షల 13 వేల 724 మంది మరణించారు.
Also read: Indian evacuation: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు షురూ- బయల్దేరిన తొలి విమానం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook