Upendra: వివాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కన్నడ సూపర్ స్టార్‌

సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు చిన్న వ్యాఖ్యలు చేసిన అవి వివాస్పదం అవుతుంటాయి. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం మాత్రం ముగియటం లేదు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2023, 11:52 AM IST
Upendra: వివాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కన్నడ సూపర్ స్టార్‌

Upendra Controversial Comments: కన్నడ సూపర్ స్టార్‌ ఉపేంద్ర మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒక వైపు సినిమాల్లో స్టార్‌ గా సూపర్‌ స్టార్‌ గా వెలుగు వెలుగుతున్న ఉపేంద్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటాడు అనే విషయం తెల్సిందే. ఆయన తన రాజకీయ పార్టీ ప్రజాకీయ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో మరియు కార్యకర్తలతో ముచ్చటించాడు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం వారిని అవమానించే విధంగా ఉన్నాయి.

ఇప్పటికే ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా విమర్శలు ఆగడం లేదు. పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసు కూడా నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల వారు ప్రకటించారు. ఉపేంద్ర తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. ఒక స్టార్ అయ్యి ఉండి.. ఒక రాజకీయ పార్టీ అధినేత అయి ఉండి మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త ఉండనక్కర్లేదా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

సాధారణంగా సెలబ్రెటీలు చిన్న చిన్న మాటలు కూడా పెద్ద వివాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కనుక సెలబ్రెటీలు స్టార్స్, రాజకీయ నాయకులు మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ తమ వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. అయినా కూడా ఏదో ఒక సమయంలో తప్పు దొర్లుతూనే ఉంటుంది.

Also Read: Farmers Loans Waiver: రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతు బంధు.. ఇప్పుడు రైతు రుణ మాఫీ

ఇటీవల ఉపేంద్ర తమను విమర్శించే వారిని దళితులతో పోల్చడంతో తీవ్రంగా వివాదాస్పదం అయింది. ప్రతి గ్రామంలో కూడా దళితులు ఉంటారు. అలాగే తమను విమర్శించే వారు కూడా ఉంటారు అంటూ ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను దళితులు తీవ్రంగా ఖండిస్తూ ఆయన పై కేసులు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అతడిని క్షమించేది లేదు అంటూ దళిత సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్‌ అయితేనేం మాట్లాడే సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు.

ఉపేంద్ర ఫోటోలు మరియు దిష్టిబొమ్మలను తగులబెడుతూ నిరసనకి దిగారు. మొత్తానికి నోరు జారిన ఉపేంద్ర దళితులకు క్షమాపణలు చెప్పినా కూడా వివాదం సర్ధుకోవడం లేదు. ఆయన్ను చాలా మంది తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Vastu Tips for Plants: ఆ 5 మొక్కల్ని ఈ దిశల్లో ఉంచుతున్నారా..తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News