మధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై నెలకొన్ని ఉత్కంఠత తెరపడింది. సీఎం అభ్యర్ధి ఎవరో ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ తేల్చేశారు. పార్టీ సీనియర్ నేత, మధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన కమల్ నాథ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేశారు. సీఎం ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయంపైనే వదిలేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ మేరకు కమల్ నాథ్ పేరును ఎంపిక చేశారు.
మాయవతి మద్దతుతో గట్టెక్కిన కాంగ్రెస్
ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్ కు రెండే రెండు సీట్ల దూరంలో నిలిచింది. ఇదే సమయంలో 109 స్థానాల్లో గెలిచి కమలం పార్టీ కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దుత ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగల్గింది. మాయావతి పార్టీకి అక్కడ కేవలం 2 సీట్లు మాత్రమే రావడం గమనార్హం.
సీనియారిటికే పట్టం కట్టిన కాంగ్రెస్
ఎన్నికలు ముగిసిన తర్వాత మధప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో కమల్ నాథ్ తో పాటు యంగ్ లీడర్ జ్యోతిరాధిత్య సింధియా రేసులో నిలిచారు. ఇద్దరి అభర్ధిత్వాన్ని పరిగణనలోకి తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ అంతిమంగా సీనియర్ అయిన కమల్ నాథ్ కే వైపే మొగ్గుచూపింది. ఎన్నికల సమయంలో మధ్రప్రేదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అన్నితానై కమల్ నాథ్ పార్టీని ముందుండి నడిపించడగా ..యువనాయకుడైన జ్యోతిరాధిత్య సింధియా ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్ వినూత్న ప్రయోగం..
ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి వినూత్న ప్రయోగం చేసింది. నేతలతో పాటు కార్యకర్తల మనోభావాలను రాహుల్ పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై తమ అభిప్రాయాలు తెలపాలని రాహుల్ సోషల్ మీడియా ద్వారా సందేశం పంపగా..అధికశాతం కార్యకర్తలు సీనియర్ నేత కమల్ నాథ్ వైపే మొగ్గుచూపినట్లు తెలిసింది. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాహుల్ గాంధీ ఈ మేరకు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేశారు.
ఉత్కంఠతకు తెర : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది