సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం: జర్నలిస్టులకు ఊరట

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jul 3, 2018, 11:01 AM IST
సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం: జర్నలిస్టులకు ఊరట

న్యూఢిల్లీ: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అక్రిడేషన్‌, నాన్‌ - అక్రిడేషన్‌ జర్నలిస్టులు ఎవరైనా కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతులిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కాగా నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ సర్క్యులర్‌ అక్రిడేషన్‌, నాన్‌-అక్రిడేషన్‌ జర్నలిస్టులందరికీ వర్తించనుంది.

జర్నలిస్ట్‌లు కోర్టు హాల్‌ లోపలికి మొబైల్‌ ఫోన్స్‌ తీసుకెళ్లాంటే వారి వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రీ ఇచ్చిన పాస్ ఉండాలని, ఈ పాస్ కాలవ్యవధి ఆరు నెలలు మాత్రమే ఉంటుందని పేర్కొంది. కోర్టు లోపల ఫోన్ ను తప్పనిసరిగా సైలెంట్ మోడ్‌లో ఉంచాలని.. ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా శిక్ష తప్పదని సర్క్యులర్‌లో హెచ్చరించింది. కోర్టు లోపల జరిగే ప్రోసిడింగ్స్‌ను రికార్డు చేయడం, వీడియో తీయడంపై నిషేధం ఉందని సీనియర్‌ న్యాయవాది ఒకరు తెలిపారు.

మే నెలలోనే జారీ అయిన ఈ సర్క్యులర్‌లో మొదట అక్రిడేషన్‌ ఉన్న జర్నలిస్టులను మాత్రమే కోర్టు హాల్‌ లోపలికి ఫోన్స్‌ తీసుకెళ్లేందుకు అనుమతినివ్వగా.. కొందరు మీడియా వ్యక్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. ఈ నూతన సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఈ విషయం గురించి ఓ సినీయర్‌ జర్నలిస్ట్‌‌ను అడగ్గా.. వారు స్పందిస్తూ.. ఇన్నేళ్ళూ కోర్టు లోపలి ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేనందువల్ల సమాచారాన్ని వెంటనే అందివ్వడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నేటి నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నారు.

Trending News