BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ.. విద్యార్థులకు జేఎన్‌యూ ఆదేశాలు

Documentary Screening on PM Modi: యూనివర్శిటీ అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ఈ డాక్యుమెంటరనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్శిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శన యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. 

Last Updated : Jan 24, 2023, 12:31 AM IST
BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ.. విద్యార్థులకు జేఎన్‌యూ ఆదేశాలు

Documentary Screening on PM Modi: ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రాూ యూనివర్శిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీపై బిబిసి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇండియా: ది మోదీ క్వశ్చన్ ప్రదర్శించేందుకు యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలు ప్లాన్ చేసుకున్నాయని సమాచారం అందుకున్న యూనివర్శిటీ రిజిస్ట్రార్.. ఆ ప్రదర్శనను నిలిపేయాల్సిందిగా విద్యార్థులకు ఆదేశాలు జారీచేశారు. యూనివర్శిటీ అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ఈ డాక్యుమెంటరనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

యూనివర్శిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శించడం వల్ల యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. అంతేకాకుండా జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలను ఉల్లంఘించి డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టయితే.. వారిపై యూనివర్శిటీ నిబంధనల కింద కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : BBC Documentary Screening in HCU Campus: హెచ్‌సీయూలో బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కలకలం.. క్యాంపస్‌లో హై టెన్షన్

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News