JEE Main 2024 Results: జాతీయ స్థాయిలో జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫైనల్ ఆన్సర్ కీ విడుదల కాగా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలను jeemain.nta.ac.in లేదా ntaresults.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో ఒకటి జేఈఈ మెయిన్స్ కాగా రెండవది జేఈఈ అడ్వాన్స్. జేఈఈ మెయిన్స్ పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఇందులో మొదటి సెషన్ పరీక్ష ఇప్పటికే పూర్తయింది. దీనికి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మెయిన్స్‌లో అర్హత పొందినవారు అడ్వాన్స్ పరీక్ష రాయగలరు. సెషన్ 1 పరీక్ష సరిగ్గా రాయనివారు, హాజరుకానివారు సెషన్ 2 రాయవచ్చు.
ఇవాళ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను jeemain.nta.ac.in లేదా ntaresults.nic.inలో మీ అడ్మిషన్ కార్డు నెంబర్ వివరాలు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు గత ఏడాది కంటే 27 శాతం ఎక్కువమంది అప్లై చేశారు. మొత్తం 12 లక్షల 31 వేల 874 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా వరిలో 95.8 శాతమంది హాజరయ్యారు.
ఈసారి కటాప్ ఎప్పటిలానే రెండు రకాలుగా నిర్ణయించారు. జేఈఈ మెయిన్ 2024 జనరల్ కేటగరీ అభ్యర్ధులకు కటాఫ్ 90 ప్లస్ కాగా ఓబీసీ-ఎన్సీఎల్ కేటగరీకు 75 ప్లస్‌గా నిర్ధారించారు. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగరీకు 78 కాగా, ఎస్సీలకు 44 ప్లస్.
Also read: Bharat Ratna: పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ సహా భారతరత్నతో గౌరవింపబడిన మాజీ ప్రధానులు వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook