Fact check: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారా? వైరల్ అవుతున్న వార్తపై జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌

కొద్దినెలల్లో భారత రాష్ట్రపతి పదవీకాలం ముగియబోతోంది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తరువాత రాష్ట్రపతి వెంకయ్య నాయుడే అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 02:16 PM IST
  • వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారా..?
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
  • ప్రచారం జరుగుతున్న వార్తపై జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌
Fact check: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారా? వైరల్ అవుతున్న వార్తపై జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌

Fact Check: కొద్దినెలల్లో భారత రాష్ట్రపతి పదవీకాలం ముగియబోతోంది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయం నుంచి ఈ సమాచారం వైరల్‌ అవుతోంది. ప్రధానంగా వాట్సప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. 

వైరల్‌ అవుతున్నది ఏంటి?
'కొద్దిసేపటి క్రితం భారత రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఎన్నిక చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది' అనేది ఈ పోస్ట్‌ సారాంశం. దీనిని బ్రేకింగ్ న్యూస్‌ అంటూ సర్క్యులేట్ చేస్తున్నారు. 

తెలుగు వారైన వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా భారత రెండో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. దేశ అత్యున్నత పదవికి ఒక మెట్లు దూరంలో ఉన్న వెంకయ్యనాయుడుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్‌ అంటూ పోస్ట్‌ సర్క్యులేట్ అవుతుండటంతో సహజంగానే తెలుగు వాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో, ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్ చెక్‌ :
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 నుంచి ఆ పదవిలోకొనసాగుతున్నారు. 2017 జూన్‌, జూలై నెలలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ అత్యున్నత పదవిని అధిష్టించారు. అప్పుడు జరిగిన ఎన్నికల నోటిఫికేషన్‌ వివరాలు చూస్తే.. 2017 జూన్‌ 17వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. దాదాపు నెలరోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత 2017 జూలై 25వ తేదీనరామ్‌నాథ్‌ కోవింద్‌ భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వివరాలను బట్టి చూస్తే ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి కూడా మరో ౩నెలల సమయం ఉంది.

పైగా, వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత పదవీకాలం ముగియడానికి కూడా మరో ఐదు నెలల సమయం ఉంది. 

వాస్తవం ఏంటి?
పై వివరాలను విశ్లేషించిన జీ తెలుగు  న్యూస్‌.. వాస్తవమేంటో కనుక్కునేందుకు ప్రయత్నించింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారులను సంప్రదించేందుకు  వెంకయ్యనాయుడు పేరుతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు అబద్ధమని తొలుత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత కాసేపటికే ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఎంపిక చేశారంటూ వస్తున్న వదంతులను ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఇప్పటివరకు అలాంటి సమాచారమేదీ లేదని, దయచేసి ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.


ప్రచారం :భారత రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవం : ఈ ప్రచారాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది.

Also read: Online Ticketing: ఏపీలో త్వరలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభం

Also read: Man Trapped: బ్యాంక్ లాకర్ గదిలో చిక్కుకుపోయిన వృద్ధుడు... 18 గంటల పాటు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News