Indian Railways Latest News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆ సేవలు ప్రారంభం

Indian Railways Latest News: కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలపై భారీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. గతంలో నిలిపివేసిన సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్​సీటీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 07:09 PM IST
  • కొవిడ్ కేసుల తగ్గుదలతో రైల్వే కీలక నిర్ణయం
  • ఏసీ కోచ్​లలో బెడ్​రోల్​, దిండు, దుప్పటి అందించేందుకు సిద్ధం..
  • త్వరలోనే అన్ని ట్రైన్​లకు వర్తింపు!
Indian Railways Latest News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆ సేవలు ప్రారంభం

Indian Railways Latest News: రైళ్లలో దూరపు ప్రయాణాలు చేసే వారికి గుడ్​ న్యూస్​. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత నిలిపివేసిన సర్వీసులు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వేస్​. ముఖ్యంగా ఏసీ కోచ్​లలోప్రయాణించే వారికి కల్పించే సౌకర్యాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. పలు ట్రైన్​లలో ఇప్పటికే ఆయా సేవలు ప్రారంభమయ్యాయి. ఇదే నెలలో ఇతర రైళ్లకు కూడా వర్తించేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది.

ఇంతకీ తిరిగి ప్రారంభమవనున్న సేవలు ఏవి?

రైళ్లలో ఏసీ కోచ్​లలో ప్రయాణించే వారికి.. బెడ్​ రోల్​, దిండు, దుప్పటి వంటివి సమకూర్చాలని నిర్ణయించింది భారతీయ ఐఆర్​సీటీసీ. దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటన్నింటిని సీల్డ్ కవర్​లో అందించాలని కూడా నిర్ణయించింది ఐఆర్​సీటీసీ.

ఈ సేవలు ఎందుకు నిలిపివేశారు?

కరోనా మొదటి దశలో  దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి దశ లాక్​డౌన్​ రైల్వే సేవలు తిరిగి ప్రారంభించగా.. ఏసీ కోచ్​లలో దిండు, బెడ్డు, దుప్పటి వంటివి సమకూర్చడం నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్​ నిబంధనలల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణికులు తమ సొంత దుప్పట్లను తెచ్చుకునేందుకు మాత్రం అనుమతినిచ్చింది.

అయితే ప్యాసింజర్లకు అందించే సేవలు పునరుద్ధరిస్తున్నప్పటికీ.. ఏసీ కోచ్​లలో ఉష్టోగ్రతను 24-25 మధ్యే ఉంచాలని నిర్ణయించింది భారతీయ రైల్వే విభాగం. ఇప్పటికే ఉత్తర రైల్వే పరిధిలోని 92 రైళ్లలో ఈ సేవలు పునరుద్ధరించినట్లు ఐఆర్​సీటీసీ పేర్కొంది. అందులో నేడే 26 ట్రైన్లలో ఈ సేవలు ప్రారంభించినట్లు వివరిచింది. త్వరలోనే మరో 23 రైళ్లలో ఈ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

Also read: Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!

Also read: BJP Foundation Day 2022: బీజేపి ఇంత పెద్ద పార్టీగా ఎలా అవతరించింది, ఎలా గెలిచి నిలిచింది.. స్పెషల్ స్టోరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News