Sheena Bora: షీనా బోరా కశ్మీర్‌‌లో బతికే ఉందంటోన్న ఇంద్రాణి ముఖర్జి.. సీబీఐకి లేఖ

Sheena Bora murder case update: షీనా బోరా హత్య ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. తన కూతురు బతికే ఉందని షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జి పేర్కొంది. ఈ మేరకు ఆమె సీబీఐకి ఒక లెటర్ రాసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 09:26 PM IST
  • షీనా బోరా హత్య కేసులో ట్విస్ట్
  • తన కూతురు బతికే ఉందంటోన్న షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జి
  • సీబీఐకి లెటర్ రాసిన ఇంద్రాణి
Sheena Bora: షీనా బోరా కశ్మీర్‌‌లో బతికే ఉందంటోన్న ఇంద్రాణి ముఖర్జి.. సీబీఐకి లేఖ

Indrani Mukerjea claims Sheena Bora is alive and Asks CBI to Look for Daughter in Kashmir: షీనా బోరా హత్య కేసు ( Sheena Bora murder case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. తన కూతురు బతికే ఉందని షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జి (Indrani Mukerjea) పేర్కొంది. ఈ మేరకు ఆమె సీబీఐకి ఒక లెటర్ రాసింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించండి అంటూ లేఖలో ఆమె కోరింది. అలాగే ఈ విషయంపై ఇంద్రాణి ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై త్వరలోనే విచారణ ప్రారంభంకానుందని సమాచారం. 

అయితే షీనా బోరా హత్య కేసులో చాలా ఏళ్ల కిందటే ఇంద్రాణి అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 2015 నుంచి ఆమె ముంబైలో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైల్లో ఉన్న ఇంద్రాణిని ఓ మహిళా ఖైదీ ఇటీవల కలిశారట. ఆమె షీనా బోరాను కశ్మీర్‌‌లో (Kashmir) చూశానని చెప్పిందట. ఈ విషయాన్ని ఇంద్రాణి లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. షీనా బోరా కోసం కశ్మీర్‌లో వెతకాలని ఇంద్రాణి సీబీఐని (cbi) కోరింది.

Also Read : West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ లో కరోనా కలకలం- 5 మందికి కొవిడ్ పాజిటివ్

ఇక షీనా బోరా హత్య (Sheena Bora murder) 2012లో జరిగింది. మూడు సంవత్సరాల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొదట ఇంద్రాణి ముఖర్జి డ్రైవర్‌ శ్యామ్‌రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. షీనాబోరాను ఇంద్రాణే గొంతు నులిమి చంపిందంటూ అతను చెప్పాడు. ఇక ప్రస్తుతం ఇంద్రాణి రాసిన లేఖ విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read : Aadhar Benefit: ఆధార్ రాకతో ప్రభుత్వానికి రూ.2.25 లక్షల కోట్లు ఆదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News