Indo-China Dispute: మాస్కో వేదికగా రాజకీయ అత్యన్నత స్థాయి భేటీ

మాస్కో వేదికగా భారత-చైనా రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో జరిగిన భేటీలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ప్రస్తావించారు.

Last Updated : Sep 5, 2020, 01:09 PM IST
Indo-China Dispute: మాస్కో వేదికగా రాజకీయ అత్యన్నత స్థాయి భేటీ

మాస్కో వేదికగా భారత-చైనా రక్షణ మంత్రులు ( india china defence ministers meet ) సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో జరిగిన భేటీలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ప్రస్తావించారు.

లడాఖ్ గల్వాన్ లోయ ( ladakh galwan valley ) లో జరిగిన ఇండో చైనా సరిహద్దు వివాదం  ( Indo china border dispute ) నేపధ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. రష్యాలోని మాస్కో వేదికగా రెండు దేశాల రక్షణ శాఖ మంత్రుల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో సరిహద్దు అంశాన్ని ప్రధానంగా రాజ్ నాధ్ సింగ్ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ఘర్షణ చెలరేగిన అనంతరం ఇప్పటివరకూ రెండు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్యనే చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి రాజకీయ భేటీ జరగడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

కొద్దిరోజుల క్రితం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్..చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ తో ఫోన్ లో మాట్లాడారు. మే నెలకు ముందున్న పరిస్థితిని కొనసాగించాలని రాజ్ నాధ్ కోరగా..చైనా మాత్రం భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించింది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఈ భేటీ ఉపయోగపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ వైపు నుంచి కచ్చితంగా ఇది ఓ ముందడుగు చర్యగా అభివర్ణిస్తున్నారు. Also read: Russia’s Vaccine: వ్యాక్సిన్ సురక్షితమే

Trending News