RapidX: ర్యాపిడ్ రైలు పేరు మార్పు.. 'నమో భారత్‌'గా నామకరణం..

First Rapid Rail: దేశంలో తొలి ర్యాపిడ్ రైలు రేపట్నించి ప్రారంభం కానుంది. తాజాగా ఈ రైలు పేరును మార్చారు అధికారులు. దీనికి 'నమో భారత్‌’'గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 11:46 AM IST
RapidX: ర్యాపిడ్ రైలు పేరు మార్పు.. 'నమో భారత్‌'గా నామకరణం..

RapidX Renamed NaMo Bharat: దేశంలోని మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్ అయిన ర్యాపిడ్‌ఎక్స్‌(RapidX) రైలు పేరును మార్చారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించడానికి ఒక్కరోజు ముందు రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్ల(RRTS) పేరును 'నమో భారత్‌'’గా మార్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

దిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ కారిడర్ లో భాగంగా.. సాహిబాబాద్‌, దుహై డిపో మధ్య సేవలందించే ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లను ప్రధాని మోదీ రేపు(అక్టోబరు 20)న ప్రారంభించనున్నారు. మెుదట 17కి.మీల పరిధిలో ఐదు స్టేషన్ల మధ్య అక్టోబర్‌ 21 నుంచి ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. రూ.30వేల కోట్లతో చేపట్టిన 85.2 కి.మీల దిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేయగా..  దీన్ని 2025 జూన్‌ నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ ₹ 30,000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. 

ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లకు నమో భారత్‌’గా పేరు మార్పు చేసినట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ట్వీట్ చేశారు. ‘''నమో స్టేడియం తర్వాత ఇప్పుడు నమో రైళ్లు. స్వీయ ప్రచారానికి హద్దు లేకుండా పోయింది''’ అంటూ విమర్శించారు.

Also Read: Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News