IRCTC Refund Rules: భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు జారీ చేసింది. ఇకపై కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుడ్ రిఫండ్ చేతికి అందుతుంది. ఐఆర్సీటీసీ జారీ చేసిన కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో టీడీఆర్ పైలింగ్ ఇలా
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టీడీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ కోసం ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఎక్కౌంట్ లాగిన్ చేయాలి. ఆ తరువాత బుక్ టికెట్ విభాగంలోకి వెళ్లాలి. ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ ఎంచుకోవాలి. తరువాత ఫైల్ టికెట్ డిపాజిట్ రిసీప్ట్ ఎంచుకోవాలి. ఇప్పుడు చివరిగా మై ట్రాన్స్‌శాక్షన్స్ ట్యాబ్‌లో ఫైల్ టీడీఆర్ ఎంచుకోవాలి.
ఐార్సీటీసీ రైల్ కాన్సెప్ట్ యాప్ ద్వారా టీడీఆర్ పైలింగ్ ఇలా
ముందుగా ఐఆర్సీటీసీ రైల్ కాన్సెప్ట్ యాప్ ఓపెన్ చేయాలి. మీ ఎక్కౌంట్ లాగిన్ చేసి మీ ట్రైన్ ఎంచుకోవాలి. మై బుకింగ్స్ క్లిక్ చేసి ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మూడు చుక్కల బటన్ క్లిక్ చేసి క్యాన్సిల్ ఆప్షన్ ఎంచుకోవాలి. తిరిగి మెయిన్ డ్యాష్ బోర్డ్‌లో వచ్చాక పైల్ టీడీఆర్ క్లిక్ చేయాలి. టీడీఆర్ రిక్వెస్ట్ కారణం ప్రస్తావించి సబ్మిట్ చేయాలి.
ఈ ప్రక్రియ ద్వారా టీడీఆర్ పైల్ చేస్తే మొత్తం రిఫండ్ పొందవచ్చు. ఛార్ట్ సిద్దమైన తరువాత కూడా అనుకోని కారణాల వల్ల రద్దు చేసుకోవల్సి వస్తే మొత్తం రిఫండ్ టీడీఆర్ ఫైలింగ్ ద్వారా పొందవచ్చు.
Also read: ISRO: న్యూ ఇయర్ వేళ ఇస్రో నూతన ప్రయోగం.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook