IMD Weather Updates: దేశంలో ఇప్పుడు మిశ్రమ వాతావరణం నెలకొంది. దేశంలోని కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత కన్పిస్తుంటే మరి కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాల్లో మంచు పెద్దఎత్తున పడుతోంది. అదే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది.
దేశంలో రానున్న 2-3 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ప్రతిరోధకాలు హిమాలయ ప్రాంతాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు ఉంటాయని తెలిపింది. మార్చ్ 5 అంటే ఇవాళ్టి నుంచి మార్చ్ 7 వరకూ జమ్ము కశ్మీర్, లడఖ్, గిల్గిట్ బాలిస్తాన్, ముజఫ్ఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ సమయంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో కూడా వర్షాలు లేదా హిమపాతం ఉండవచ్చని అంచనా.
అదేవిధంగా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో వర్ష సూచన ఉంది. ముఖ్యంగా అస్సోం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్ని కొన్ని ప్రాంతాల్లో రేపు అంటే మార్చ్ 5న తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక కేరళ, రాయలసీమ, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడ్రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రానున్న రెండు మూడ్రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఇక బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగడ్, ఛత్తీస్‌ఘర్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అంటే గత 3-4 రోజులుగా పగటి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలకు చేరుకుంటోంది. ఇక రాత్రి వేళ కూడా 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని సమాచారం.
Also read: Loksabha Elections 2024: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్, మనీ లాండరింగ్ కేసు కొట్టివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook