India Weather Updates: తమిళనాడు సహా ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

India Weather Updates: భగభగమండే ఎండల్నించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా సేద తీరనున్నాయి. ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం లభించనుంది. దేశంలోని ఈ రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2024, 12:04 PM IST
India Weather Updates: తమిళనాడు సహా ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

India Weather Updates: ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాకు మోస్తరు నుంచి భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఏప్రిల్ నెల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా రిలీఫ్ కలిగింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పుడిక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. అస్సోం, బంగ్లాదేశ్ మీదుగా ఏర్పడిన తుపాన్ కారణంగా రాజస్థాన్ నుంచి అస్సోం వరకూ ద్రోణి విస్తరించింది. ఫలితంగా పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతోనూ, బలమైన ఈదురు గాలులతోనూ వర్షాలు పడనున్నాయి. మద్యప్రదేశ్ , విదర్భ ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశముంది. 

జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడనున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో ఈదురుగాలులు, దుమ్ము ధూళితో వర్షాలు పడనున్నాయి. అస్సోం వరకూ విస్తరించిన ఈ ద్రోణి తమిళనాడు మీదుగా దక్షిణంవైపుకు కదులుతోందని ఐఎండీ తెలిపింది. దాంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు పడనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Also read: Samsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News