భారతదేశం అతి త్వరలోనే అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకోనుంది. ప్రపంచ జనాభాలో మూడోవంతు ఉన్న చైనాను దాటిపోనుంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఆక్రమించేందుకు కేవలం 4 నెలల దూరంలో ఉంది.
భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను చేరుకోవాలని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. ఆర్ధిక మాంద్యం ఉన్న ప్రస్తుత తరుణంలో అది ఎప్పటికి సాధ్యమౌతుందో లేదో గానీ..జనాభా విషయంలో మాత్రం అరుదైన మైలురాయిని చేరుకోనుంది. అతి త్వరలోనే ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. కేవలం 4 నెలల వ్యవధిలో జనాభాలో ఇండియా చైనాను దాటిపోనుంది. అంటే 2023 ఏప్రిల్ నాటికి జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాను ఇండియా రెండవ స్థానంలోకి నెట్టనుంది.
కేవలం నాలుగు నెలల వ్యవధిలో భారత జనాభా చైనాను దాటడానికి కారణాలు లేకపోలేదు ఇటీవలి కాలంలో చైనాలో జననాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2021లో దేశం మొత్తం మీద కేవలం 1.60 కోట్ల జననాలే నమోదయ్యాయి. మరోవైపు చైనాలో మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటోంది. చైనా జనాభా ఇప్పుడు 141.24 కోట్లు కాగా, ఇండియా జనాభా 139.34 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చైనా జననాల రేటు పడిపోవడంతో మరో నాలుగు నెలల్లో ఇండియా చైనాను దాటుతుందని అంచనా.
ఇండియాలో జనాభా వృద్ధి రేటు 1 శాతం ఉంటే..చైనాలో అది 0.1 శాతానికి పడిపోయింది. ఇండియాలో జననాల రేటు 2.18 శాతం ఉంటే..చైనాలో 1.70 శాతం ఉంది. ఈ లెక్కన చైనా జనాభాను కేవలం 4 నెలల వ్యవధిలో అంటే 2023 ఏప్రిల్ నాటికి ఇండియా దాటేస్తుందని అంచనా.
అదే సమయంలో కొరియా, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి తూర్పు ఆసియా దేశాలు ఇండియా కంటే ఆలస్యంగానే జనాభా నియంత్రణ చేపట్టినా..సంతానోత్పత్తిని త్వరగా తగ్గించగలిగాయి. ఆ దేశాల్లో మాతా శిశు మరణాల రేటు తగ్గడం, ఆదాయం పెంపు, మెరుగైన జీవన ప్రమాణాల కల్పన పెరిగింది. ఆయుర్దాయంతో పాటు ఆదాయం కూడా పెంచుకున్నాయి.
ప్రపంచంలో 25 ఏళ్లలోపున్న ప్రతి ఐదుమందిలో ఒకరు భారతీయులే కావడం గమనార్హం. దేశ జనాభాలో కూడా 47 శాతం మంది 25 ఏళ్ల లోపు వయసు కలిగినవారే. 1947లో దేశ ప్రజల సగటు వయస్సు 21 ఏళ్లైతే..ఇప్పుడు 28 ఏళ్లకు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook