Corona cases in India: కొత్తగా 9,419 కరోనా కేసులు- 130 కోట్లు దాటిన టీకాల పంపిణీ

Corona cases in India: దేశంలో కరోనా కేసులు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,419 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 11:13 AM IST
  • మరోసారి 10 వేల దిగువన కరోనా కేసులు
  • తగ్గుముఖం పట్టిన కొవిడ్ మరణాలు
  • దేశంలో 95 వేల దిగువకు యాక్టివ్ కేసుల సంఖ్య
Corona cases in India: కొత్తగా 9,419 కరోనా కేసులు- 130 కోట్లు దాటిన టీకాల పంపిణీ

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు 10 వేల దిగువనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,419 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,89,983 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది.

కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 159 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,251 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 94,742 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.27 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,74,111 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,666,241 మందికి కరోనా సోకగా.. అందులో 3,40,97,388 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. 

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 80,86,910 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,30,39,32,286 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 268,117,029 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,295,199 మంది మహమ్మారికి బలయ్యారు. 241,320,431 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 21,501,399 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

భారత్​తో పాటు ప్రపంచ దేశాలను ప్రస్తుతం కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ భయాలు  వెంటాడుతున్నాయి. పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

Also read: CDS Bipin Rawat: బిపిన్​ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్​ క్రాష్​కు ముందు కనిపించిందిలా..

Also read: CDS Bipin Rawat: శుక్రవారం సీడీఎస్ బిపిన్​ రావత్ అంత్యక్రియలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News