Covid 19 Cases: నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... కరోనాతో మరో 40 మంది మృతి

India Covid 19 Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3688 కరోనా కేసులు నమోదవగా... గడిచిన 24 గంటల్లో కొత్తగా 3324 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 10:26 AM IST
  • దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు
  • నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు
  • కొత్తగా ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..
 Covid 19 Cases: నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... కరోనాతో మరో 40 మంది మృతి

India Covid 19 Cases: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3324 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,79,188కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5,23,843కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

నిన్నటితో (ఏప్రిల్ 30) పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న 3688 కేసులు నమోదవగా... నిన్నటి కన్నా ఇవాళ 364 కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉండగా... వీక్లీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన 40 మరణాల్లో 36 మరణాలు కేరళలోనే చోటు చేసుకోవడం గమనార్హం. కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒకరు చొప్పున కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనాతో 5,23,843 మరణాలు నమోదవగా.. మహారాష్ట్రలో 1,47,843 కేరళలో 69,047 కర్ణాటకలో 40,101 తమిళనాడులో 38,025 ఢిల్లీలో 26,175 ఉత్తరప్రదేశ్‌లో 23,507 మరణాలు నమోదయ్యాయి. 

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఫోర్త్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫోర్త్ వేవ్ ఎప్పుడొస్తుందనే దానిపై అంచనాలే తప్ప ఇప్పటికైతే కచ్చితమైన సమాచారమేదీ లేదు. ఒక సర్వే ప్రకారం ఇప్పటికే ఫోర్త్ వేవ్ మొదలైందని ఇండియాలో చాలామంది భావిస్తున్నారు. ప్రతీ ముగ్గురిలో ఒకరు ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందని భావిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. 

Also Read: LPG Cylinder Price: మరోసారి భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... బిగ్ షాక్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు...

Also Read: Yadadri Parking Fee: యాదాద్రికి కారులో వెళ్తున్నారా.. పార్కింగ్ ఫీజు తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News