Covid Cases: లక్షా 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు... దేశంలో తగ్గని కొవిడ్ తీవ్రత

Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 866 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 41 మంది చనిపోయారు.

Written by - Srisailam | Last Updated : Jul 25, 2022, 10:56 AM IST
  • దేశంలో కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం
  • గత 24 గంటల్లో 16866 కొత్త కేసులు
  • లక్షా 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Covid Cases: లక్షా 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు... దేశంలో తగ్గని కొవిడ్ తీవ్రత

Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ కొత్త కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16 వేల 866 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  2.39 లక్షల మందికి పరీక్షలు చేశారు.ముందురోజు కంటే నాలుగువేల మేర కేసులు తగ్గాయి. పాజిటివిటీ రేటు మాత్రం 7.03 శాతానికి పెరిగింది. పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసులు తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు 7 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోందిగత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 41 మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 26 వేల 74కి పెరిగింది.

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  18 వేల 148 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.34 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.48శాతంగా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.  నిన్న మరో 16 లక్షల 82 వేల 390 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 202  కోట్ల 17 లక్షల 66 వేల 615 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవస

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

 
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News