Covid Cases Updates: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. దాదాపు నాలుగు నెలల తర్వాత యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15 వేల 940 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 20 మంది చనిపోయారు. అయితే నిన్నటి పోల్చితే మాత్రం కొవిడ్ కేసులు తగ్గాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోనూ కొవిడ్ కేసుల సంఖ్య 5 వందలకు దగ్గరలో ఉంది.
కొవిడ్ నుంచి గత 24 గంటల్లో 12 వేల 425 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 4 కోట్ల 27 లక్షల 67 వేల 481గా ఉంది. రికవరీ రేటు 98. 58 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 91 వేల 779 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 0.21 శాతానికి పెరిగింది. దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజువారి పాజిటివిటి రేట్ 4 .3 శాతం దాటింది. కొవిడ్ కేసులు ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
#COVID19 | India reports 15,940 fresh cases and 20 deaths in the last 24 hours.
Active cases 91,779
Daily positivity rate 4.39% pic.twitter.com/EjMC4GKIZv— ANI (@ANI) June 25, 2022
Read also: Emergency In India: ఎమర్జెన్సీకి 47 ఏళ్లు.. కాపాడాల్సిన ప్రభుత్వమే కోరలు చాచిన పరిణామం
Read also: Monkeypox: 58 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. మహమ్మారిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.