Covid -19 Updates: కేసులు తగ్గిన, పెరుగుతున్న కరోనా మరణాలు...

దేశంలో కరోనా  కేసులు స్వల్పంగా తగ్గిన మరణాల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38వేలకుపైగా కేసులు నమోదుకాగా..వైరస్ తో 617 మంది మరణించారు.

Last Updated : Aug 7, 2021, 03:13 PM IST
  • 24 గంటల్లో 38వేలకు పైగా నమోదైన కరోనా కేసులు
  • కరోనా కేసులు తగ్గిన పెరుగుతున్న మరణాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ఊరట కలిగిస్తున్న కరోనా కేసులు
Covid -19 Updates: కేసులు తగ్గిన, పెరుగుతున్న కరోనా మరణాలు...

Covid-19 Updates: దేశంలో కరోనా  కేసులు (Covid-19  Cases) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  38,628  మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 617 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 40,017 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

 తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల(Corona Cases) సంఖ్య 3,18,95,385 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,27,371కి చేరింది. నిన్న 17లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్​ కేసులు(Active Cases) సంఖ్య 4,12,153గా ఉంది.

 

50కోట్ల టీకాల పంపిణీ

దేశంలో  ఇప్పటి వరకు మెుత్తం 50,10,09,609 టీకా డోసుల(Vaccine)ను పంపిణీ చేసనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం 49,55,138 డోసులు ఇచ్చినట్లు పేర్కొంది.

Aslo Read:కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు

 

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి..

ఏపీలో  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 2,209 మందికి పాజిటివ్‌గా (Positive cases) తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. శుక్రవారం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 13,490కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. మరోవైపు.. 1,896 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Real: సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయ్.. అనుమతికి జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు

తెలంగాణలో కరోనా కేసులు(Covid Cases) తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 577 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,48,388కి చేరింది. వైరస్ తో ఇద్దరు మృతి చెందారు.  దీంతో మృతుల సంఖ్య 3,819కి పెరిగింది. మహమ్మారి​ బారి నుంచి మరో 645 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో 8,674 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News