India Covid-19 Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..మెుత్తం కేసులు ఎన్నంటే?

India Covid-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి 3 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో వైరస్​తో మరో 439 మంది మరణించారు.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 10:00 AM IST
  • దేశంలో మరో 3,06,064 కరోనా కేసులు
  • వైరస్ తో 439 మంది మృతి
  • జోరుగా కొనసాగుతున్న టీకా పంపిణీ
India Covid-19 Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..మెుత్తం కేసులు ఎన్నంటే?

India Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో.. కొత్తగా 3,06,064 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.95 కోట్లకు చేరింది. వైరస్​తో మరో 439 మంది మరణించారు.  దీంతో దేశంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,89,848 చేరింది. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో కొవిడ్ (Covid-19) నుంచి 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 3,68,04,145 కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 22,49,335 కరోనా యాక్టివ్ (Active Cases in india) కేసులున్నాయి. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 27,56,364 డోసులు (Vaccination in India) అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516కు చేరింది.

Also Read: Covid New Guidelines: పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 21,66,916 మందికి (World Wide Corona Cases) కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో 4,627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,19,19,504కి చేరగా.. మరణాల సంఖ్య 56,14,336కు పెరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News