Corona cases in India: దేశంలో 7 వేల దిగువకు కొత్త కేసులు- మరణాల్లోనూ భారీ క్షీణత

Corona cases in India: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 7 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో కూడా భారీగా క్షీణత నమోదైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 10:42 AM IST
  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
  • కొత్తగా 7 వేలకు దిగువన నమోదు
  • 572 రోజుల కనిష్టానికి యాక్టివ్​ కేసులు
Corona cases in India: దేశంలో 7 వేల దిగువకు కొత్త కేసులు- మరణాల్లోనూ భారీ క్షీణత

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,563 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,77,055 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడపినట్లు తెలిపింది.

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 132 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 8,077 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

ఓ వైపు ఒమిక్రాన్​ వేరియంట్​ కేసుల భయాలు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం కొవిడ్​ కేసుల్లో మాత్రం క్షీణత నమోదవుతుండటం గమనార్హం.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 82,267 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతంగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు 572 రోజుల కనిష్టానికి చేరాయి.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,77,422 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,746,838 మందికి కరోనా సోకగా.. అందులో  3,41,87,017 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.39 శాతానికి పెరిగింది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 15,82,079 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,37,67,20,359 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 275,017,427 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,370,457 మంది మహమ్మారికి బలయ్యారు. 246,766,389 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 22,880,581 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Aadhaar-voter card link: ఆధార్​తో ఓటర్​ ఐడీ అనుసంధానం- నేడు లోక్ సభ ముందుకు బిల్లు!

Also read: Video: పెళ్లి కొడుకును చితకబాదిన వధువు కుటుంబం-తీరా పెళ్లి సమయానికి ఆ డిమాండ్ చేయడంతో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News