India Covid Vaccination: దేశంలో ఇప్పటికీ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు 4 కోట్ల మంది..

India Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ఇటీవలే 200 కోట్ల మార్క్‌ను చేరుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ దేశంలో కోవిడ్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారి సంఖ్య ఎక్కువగానే ఉంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 23, 2022, 03:12 PM IST
  • దేశంలో ఇప్పటికీ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు 4 కోట్లు
  • లోక్‌సభలో వెల్లడించిన కేంద్రమంత్రి
  • ఇటీవలే 200 కోట్ల మార్క్ చేరుకున్న భారత్
India Covid Vaccination: దేశంలో ఇప్పటికీ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు 4 కోట్ల మంది..

India Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ఇటీవలే 200 కోట్ల మైలురాయిని దాటిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత వేగంగా 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంత ఘనత సాధించినప్పటికీ దేశంలో ఇప్పటికీ కరోనా సింగిల్ డోసు కూడా తీసుకోనివారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దేశంలో ఇప్పటికీ 4 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదని కేంద్రం వెల్లడించింది.

లోక్‌సభ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'జూలై 18, 2022 నాటికి టీకా తీసుకోవడానికి అర్హులైనవారిలో ఇంకా 4 కోట్ల మంది ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని అంచనా వేశాం.' అని కేంద్రమంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్ డోసుల లెక్కలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇలా బదులిచ్చారు.

దేశవ్యాప్తంగా జూలై 18 నాటికి 1,78,38,52,566 కోట్ల (97.34 శాతం) వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. 60ఏళ్లు పైబడినవారికి, హెల్త్ కేర్ వర్కర్స్‌కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి ప్రికాషన్ డోసు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకూ దేశంలో వయోజనులైన 98 శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. 90 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. 

Also Read: Shiv Sena: శివసేన ఎవరిది..? ఉద్దవ్ ఠాక్రేదా..షిండేదా..పరిస్థితులు ఏం చెబుతున్నాయి..!

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలను వీడని వానలు..మరోమారు రెయిన్ అలర్ట్ జారీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News