Covid-19 fourth wave scare in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 మందికి కరోనా పాటిజివ్ (Corona Cases in India)గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 2,513 మంది కోలుకున్నారు. దీంతో మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా నమోదైంది. నిన్న 3,07,716 మందికి కరోనా పరీక్షలు చేశారు.
#COVID19 | India reports 3,714 fresh cases, 2,513 recoveries, and 7 deaths in the last 24 hours.
Total active cases are 26,976 pic.twitter.com/mZIs8dP73f
— ANI (@ANI) June 7, 2022
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మెుత్తం కేసుల సంఖ్య 4,31,85,049 కాగా...మెత్తం మరణాల సంఖ్య 5,24,708గా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,976గా నమోదైంది. భారత్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. సోమవారం 13,96,169 మందికి కొవిడ్ టీకాలు వేశారు. మెుత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది.
వరల్డ్ వైడ్ గా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3 లక్షల 27 వేలకుపైగా కేసులు వచ్చాయి. వైరస్ ధాటికి మరో 754 మంది మృతి చెందారు. ఉత్తర కొరియాలో 66 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. అగ్రరాజ్యం అమెరికాలో మరో 54 వేలకుపైగా కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి.
Also Read: Indian Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ..ఈసారి ఎవరో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook