Corona Cases Rising Again: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో 11,451 కొత్త కేసులు, 266 మరణాలు

Corona Cases Rising Again: దేశంలో తాజాగా 11,451 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్​ తో మరో 266 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 13,204 మంది కోలుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 10:16 AM IST
    • దేశంలో స్వల్వంగా పెరిగిన కరోనా కేసులు
    • గడచిన 24 గంటల్లో 11,451 కొత్త కేసులు, 266 మరణాలు నమోదు
    • నిన్న ఒక్కరోజే కోలుకున్న 13,204 మంది
Corona Cases Rising Again: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో 11,451 కొత్త కేసులు, 266 మరణాలు

Corona Cases Rising Again: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు (Covid cases in India) నమోదవుతున్నాయి. తాజాగా 8,70,058 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,451 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 5.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. అలాగే నిన్న 266 మంది ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,61,057 మంది మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. క్రియాశీల రేటు గతేడాది మార్చి నాటి కనిష్ఠానికి చేరగా.. రికవరీ రేటు అప్పటి గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం 1,42,826 క్రియాశీల కేసులుండగా (Corona Active Cases in India).. ఆ రేటు 0.42 శాతానికి చేరింది. నిన్న 13,204 మంది కోలుకోగా (Recovery Rate In India).. మొత్తంగా 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.

పండగల సీజన్, ప్రభుత్వ సెలవులు కారణంగా గత నెల నుంచి టీకా కార్యక్రమం (Vaccination in India) నెమ్మదించింది. నిన్న 23,84,096 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 108 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,42,064మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 4,595 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,06,10,452 కు చేరింది. మొత్తం మరణాలు 50,64,460కి చేరాయి. 

Also Read: Punjab cuts petrol Price: ఎన్నికలకు ముందు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం- పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు  

Also Read: New rules to Central employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ వెసులుబాట్లు బంద్​- రేపటి నుంచి కొత్త రూల్స్​!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News