'కరోనా వారియర్స్'ను గౌరవిద్దాం.. !!

'కరోనా వైరస్'ను ముందు వరుసలో ఉండి ధీటుగా ఎదుర్కుంటున్న 'కరోనా వారియర్స్'ను గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

Last Updated : May 7, 2020, 09:35 AM IST
'కరోనా వారియర్స్'ను గౌరవిద్దాం.. !!

'కరోనా వైరస్'ను ముందు వరుసలో ఉండి ధీటుగా ఎదుర్కుంటున్న 'కరోనా వారియర్స్'ను గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో బుద్ధపూర్ణిమను సంతృప్తిగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే బుద్ధపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు భౌతికంగా బుద్ధపూర్ణిమ కార్యక్రమాల్లో పాల్గోని లేని పరిస్థితి ఉందని ప్రధాని అన్నారు. అందరితో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటే బాగుండేదని తెలిపారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు అనుమతించడం లేదన్నారు. 

కరోనా వైరస్ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తున్నా.. మన దేశంలో ఉన్న కరోనా వారియర్స్ ..  ముందు వరుసలో ఉండి దానితో యుద్ధం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. అంతే కాదు దేశ ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను ఫణంగా పెట్టిన వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు దేశం కోసం 24 గంటలు పని చేస్తున్న తీరును ప్రధాని అభినందించారు.

ప్రస్తుతం దేశంలో ఒకరికొకరు జాతి, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా సాయం చేసుకుంటున్నారని మోదీ తెలిపారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం భారతీయ సంస్కృతి అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే మానవత్వాన్ని చాటుకుంటే.. ప్రేమ, సోదరభావం పెరుగుతాయని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తమ జీవితాన్ని వెలిగించుకుని ..  ఇతరుల జీవితాల్లోనూ వెలుగు చూడాలని గౌతమ బుద్ధుడు మనకు బోధించారని ఆయన అన్నారు. బుద్ధుని మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News