India Covid-19 Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇండియాలో నేటి ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,506 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 895 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు.
నిన్న ఒక్కరోజు 41,526 మంది కరోనా మహమ్మారిని జయించారు. తాజా రికవరీ కేసులతో కలిపితే ఇండియాలో కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,99,75,064 (2 కోట్ల 99 లక్షల 75 వేల 64)కు చేరుకుంది. కోవిడ్-19 (COVID-19) బారిన పడి ఇప్పటివరకూ 4,08,040 (4 లక్షల 8 వేల 40) మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 4 లక్షల 54 వేల 118కి దిగొచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID19 | India reports 41,506 new cases, 895 deaths and 41,526 recoveries today, as per Union Health Ministry
Total active cases: 4,54,118
Total discharges: 2,99,75,064
Death toll: 4,08,040Total Vaccination : 37,60,32,586 pic.twitter.com/Ccur2VhC4T
— ANI (@ANI) July 11, 2021
కరోనా కేసులలో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తరువాత భారత్ రెండో స్థానంలో ఉండగా, కరోనా వైరస్ (CoronaVirus) మరణాలలో మూడో స్థానంలో ఉందని తెలిసిందే. అయితే కోవిడ్19 వ్యాక్సినేషన్‌లో అత్యధిక డోసులు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. భారత్‌లో ఇప్పటివరకూ (37,60,32,586) 37 కోట్ల 60 లక్షల 32 వేల 586 డోసుల కరోనా టీకాల ప్రక్రియ పూర్తయిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, టీకాలు వేయించుకోవాలని, కోవిడ్19 నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Bharat Biotech: కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Corona Cases: కరోనా పాజిటివ్ కేసుల కంటే Covid-19 రికవరీలే అధికం
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తరువాత రెండో స్థానంలో భారత్
గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,506 మంది కరోనా పాజిటివ్
దేశంలో మరో 895 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు