భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 654 మంది కోవిడ్19 బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Cases in India) 14,83,157కు చేరింది. జులై నెలలో గత కొన్ని రోజులుగా నిత్యం 45వేలకు పైగా తాజా కోవిడ్19 పాజిటివ్ కేసులు రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. Telangana: కొత్తగా 1,610 కరోనా కేసులు..
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 33,425కు చేరింది. భారత్‌లో మొత్తం కరోనా కేసులకుగానూ చికిత్స అనంతరం 9,52,744 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,96,988 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. MURDER Trailer: ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..
కాగా, భారత్‌లో గత రెండు రోజులుగా 5 లక్షలకు పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 5,15,000 శాంపిల్స్ పరీక్షించగా, జులై 27న (గత 24 గంటల్లో) 5,28,000 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
India: 33వేలు దాటిన కరోనా మరణాలు