భారత్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న కరోనా కేసులు

India CoronaVirus Cases |  దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.  

Last Updated : Jun 25, 2020, 01:15 PM IST
భారత్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి (CoronaVirus) రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారత్‌లో ఒక్కరోజులోనే 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది. ఈ మహమ్మారితో దేశంలో గత 24గంటల్లో 16,922 కేసులు నమోదు కాగా.. 418మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 4,73,105కి పెరిగింది. మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్ COVIFOR.. ధర నిర్ణయించిన హెటిరో

గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్ కేసులు (corona active cases) ఉన్నాయి. 2,71,697మంది పూర్తిగా కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 14,894మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్

మహారాష్ట్ర, ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా విలయం..
మహారాష్ట్ర (Maharashtra)లో గత 24గంటల్లో 3,890 కరోనా కేసుల నమోదు కాగా... 208మంది మరణించారు.  దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,42,900కి పెరిగింది. ఇప్పటివరకు 6,739మంది మరణించారు. 

ఢిల్లీ(Delhi) లో గత 24గంటల్లో 3,788 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 70,390కి పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఢిల్లీలో 2,365మంది మరణించారు.జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News