ITR Deadline: ఆ రోజులోగా ఐటీ పని పూర్తి చేయకుంటే 10 వేల జరిమానా జాగ్రత్త

ITR Deadline: ఇన్‌కంటాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. ఇంకా రెండ్రోజులే గడువు మిగిలుంది. ఈ రెండ్రోజుల్లో ఆ పని పూర్తి చేయకుంటే భారీ జరిమానా తప్పదు. చర్యలు కూడా ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2024, 07:26 PM IST
ITR Deadline: ఆ రోజులోగా ఐటీ పని పూర్తి చేయకుంటే 10 వేల జరిమానా జాగ్రత్త

ITR Deadline: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్. మరో రెండ్రోజుల్లో డిసెంబర్ ముగియనుంది. అదే సమయంలో ఇన్‌కంటాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ ఇది. ఈ రెండ్రోజుల్లో అంటే డిసెంబర్ 31లోగా ఆ పని పూర్తి చేయకపోతే భారీ జరిమానా ఏకంగా 10 వేలు పడుతుంది. 

మీరు ట్యాక్స్ పేయర్ అయి ఉండి ఇంకా ఈ ఏడాది అంటే 2023-24 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోయుంటే వెంటనే అలర్ట్ అవాలి. ఎందుకంటే మరో రెండ్రోజుల్లో చివరి గడువు కూడా ముగియనుంది. డిసెంబర్ 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ గడువు తేదీ జూలై 31 నుంచి డిసెంబర్ 31కు కొద్దిపాటి జరిమానాతో పొడిగించారు. మరో రెండ్రోజులే మిగిలుంది. ఈ తేదీలోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏకంగా 10 వేల రూపాయలు జరిమానా పడుతుంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ,2024-25 అసెస్‌మెంట్ ఫైల్ చేసేందుకు జూలై 31 గజడువు ఉండేది. కానీ కొద్దిగా జరిమానాతో డిసెంబర్ 31 వరకూ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఈ లేట్ ఫీ అనేది రెండు కేటగరీల్లో ఉంటుంది. 

ఏడాది ఆదాయం 5 లక్షల్లోపుంటే 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది ఆదాయం 5 లక్షలు దాటితే మాత్రం జరిమానా 5 వేలు చెల్లించాలి. ఈ తేదీలోగా ఎన్నిసార్లయినా ఐటీ రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.  డిసెంబర్ 31 చివరి డెడ్‌లైన్ కూడా ముగిస్తే 5 లక్షలు ఆదాయం దాటినవారికి జరిమానా 10 వేలుంటుంది. అంతేకాకుండా చట్టప్రకారం చర్యలు కూడా ఉండవచ్చు. అందుకే ఇప్పటికీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి.

ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి

ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చెందిన ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్‌తో లాగిన్ అవాలి. మీకు సంబంధించిన ఐటీఆర్ ఫామ్ ఎంచుకుని ఫిల్ చేయాలి. ఇందులో అసెస్‌మెంట్ ఇయర్ 2024-25, రిటర్న్స్ 2023-24 ఎంచుకోవాలి. మీ ఆదాయం, ట్యాక్స్ మినహాయింపు , ట్యాక్స్ లయబిలిటీ సమాచారం ఎంటర్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటే ఆన్‌లైన్‌లో వెంటనే చెల్లించాలి. చివరిగా ఆధార్ ఓటీపీతో వెరిఫై చేస్తే చాలు..మొత్తం ప్రక్రియ పూర్తయిపోతుంది

Also read: Bank of Baroda Jobs: 1 లక్షా 30 వేల జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News