IMA demanded Covid-19 vaccination for all diabetes patients: దేశంలో మధుమేహంతో బాధ పడుతున్న వారందరికి కొవిడ్ టీకాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. వారికి కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నందున ఈ డిమాండ్ చేస్తున్నట్లు (Indian Medical Associatio) తెలిపింది. ఇంకా అవసరమైతే బూస్టర్ డోసు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.
మధుమేహం మేహ సమస్యను ముందుగానే గుర్తించి (campaign for early detection).. జాగ్రత్త పడేందుకు గానూ ఐఎంఐ ఆదివారం వాకథాన్, మారథాన్, స్క్రీనింగ్ క్యాంపులతో పాటు సోషల్ మీడియా డ్రైవ్‌లను నిర్వహించింది. ఇందులో భాగంగానే ఈ డిమాండ్ చేసింది.
యువ డాక్టర్లు, పలు ఆస్పత్రుల కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.
Also read: Madhya Pradesh: ఆవు పేడ కొనే యోచనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వెల్లడి!
100 కోట్ల మందికి అవగాహనే లక్ష్యం..
వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఐఎంఏ. పది రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగనున్నట్లు తెలిపింది. 100 కోట్ల మందికి మధుమేహంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపింది.
ఈ కార్యక్రమం కోసం ఐఎంఐ.. ఆసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఆర్ఎస్ఎస్డీఐ, ఎండోక్రైన్ సొసైటీ సహా పలు ఇతర ఆర్గనైజేషన్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Also read: LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం
Also read: Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే
67 లక్షల మంది మధుమేహంతో మృతి..
ఈ సందర్భంగా డయాబెటీస్‌కు సంబంధించి పలు గణాంకాలను విడుదల చేసింది (10th Edition of the IDF Diabetes) ఐఎంఐ. ఐడీఎస్ 10వ ఎడిషన్ డయాబెటీస్ అట్లాస్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఇప్పటి వరకు 67 లక్షల మంది డయాబెటీస్‌తో మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తపంగా 53.7 కోట్ల మంది (20-79 సంవత్సరాల వయసున్న వారు) మధుమేహంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది.
ఈ సంఖ్య 2030 నాటికి 64.3 కోట్లకు, 2045 నాటికి 784 కోట్లకు పెరిగే అవకాశముందని వివరించింది.
మధుమేహం సమస్య పురుషులకన్నా మహిళలకే ఎక్కువగా ఉన్నట్లు ఈ వివేదిక వివరించింది. అయితే కొంత మందిలో ముందుగా నిర్ధారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది నివేదిక.
Also read: Gang Rape: మహారాష్ట్రలో దారుణం...మైనర్ బాలికపై 400 మంది 6 నెలలుగా అత్యాచారం...
Also read: Centre Ordinace: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం ఐదేళ్లకు పొడగింపు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook