ICMR: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌కు(Corona Second Wave) కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. మరోవైపు ఇదే వేరియంట్ డెల్టా ప్లస్ వేరియంట్‌గా(Delta plus Variant) రూపాంతరం చెంది మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో డెల్టా వేరియంట్(Deltal Variant) విషయంలో ఐసీఎంఆర్ గుడ్‌న్యూస్ అందించింది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇస్తే చాలు..డెల్టా వేరియంట్ నుంచి సైతం రక్షణ కల్పిస్తుందని ఐసీఎంఆర్ (ICMR)స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield vaccine) ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో..కరోనా నుంచి కోలుకుని ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిని పోల్చి చూస్తే డెల్టా వేరియంట్ నుంచి అత్యధిక రక్షణ పొందారని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. కోవిడ్ బారినపడిన వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్‌కు వ్యాక్సిన్ సింగిల్ డోస్ కలిస్తే..మరింత ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ కలుగుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో 45 లక్షల 60 వేల సెంటర్ల ద్వారా దాదాపుగా 35 కోట్ల వ్యాక్సిన్ పంపిణి జరిగింది. ఓ వైపు వ్యాక్సినేషన్(Vaccination) జరుగుతుండగానే..వ్యాక్సిన్‌కు సంబంధించి వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు వివిధ రకాల వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి.
Also read: SP-AAP Alliance: యూపీలో ఎన్నికల్లో ఎస్పీ-ఆప్ పొత్తు దిశగా సాగుతున్న ప్రయత్నాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook