3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం, సుమారు 300 మంది ఉగ్రవాదులు హతం !

3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం, సుమారు 300 మంది ఉగ్రవాదులు హతం !

Last Updated : Feb 26, 2019, 12:42 PM IST
3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం, సుమారు 300 మంది ఉగ్రవాదులు హతం !

న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంపైకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 కంట్రోల్ రూమ్స్‌తోపాటు దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని బాలాకోట్, చకోటి, ముఝఫరాబాద్ ప్రాంతాల్లో భారత వైమానిక దళం ఈ దాడులు జరిపింది. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరం, కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్‌కి అక్కడి నుంచే ఐకామ్ హ్యాండ్‌సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం, ఆదేశాలు అందుతాయి. 

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌కు బాలాకోట్‌ బాగా పట్టున్న ప్రాంతం కావడంతో భారత వైమానిక దళం ఆ ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. మరో రెండు నిషేదిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు సైతం ముఝఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నాయి.

Trending News