గోవాలో కుంటుపడిన పాలన ; సీఎం పారికర్ రాజీనామాకు డెడ్ లైన్

                      

Last Updated : Nov 21, 2018, 10:35 AM IST
గోవాలో కుంటుపడిన పాలన ; సీఎం పారికర్ రాజీనామాకు డెడ్ లైన్

గోవాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మనోహర్ పారికర్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ జనాలు రోడ్డెక్కారు. పారికర్ నివాసం వైపు  "పీపుల్స్ మార్చ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ గవర్నెన్స్" పేరిట ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఆయన ఇంటివైపు ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పారికర్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని నిరసనకారులు డెడ్ లైన్ విధించారు. గోవా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. వెంటనే పారికర్ స్థానంలో పూర్తిస్థాయి సీఎంను వెంటనే నియమించాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ పాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. దీంతో కుంటుపడిన పాలన ముందుకు కదలడం లేదు. పాలనా వ్యవహారాలు చురుగ్గా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఈ రోజు జరిగిన ర్యాలీలో ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. దీనికి ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలు ఈ ర్యాలీకి మద్దతు పలకడం గమనార్హం.
 

Trending News